Bholaa Shankar Review Rating.. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఎలా వుండబోతోంది.? ఎలా వున్నా సరే, సినిమాకి రివ్యూలు.. రేటింగులు.. రెండూ సిద్ధమైపోయాయ్.!
ఏయే రివ్యూ ఎలా వుండబోతోంది.? ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రముఖ వెబ్ సైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ‘2’ అనే రేటింగ్ దాటకూడదని డిసైడ్ అయ్యిందట.
ఇంకో రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వెబ్ సైట్ అయితే, కాస్త కనికరించి.. రెండున్నరకి లోపలే రేటింగ్ వెయ్యాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మొత్తంగా, ఏ రివ్యూ చూసినాగానీ.. రెండున్నరకి పైన రేటింగ్స్ రాకపోవచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
Bholaa Shankar Review Rating.. అసలేంటీ పైత్యం.?
ఎందుకిలా.? సినిమా రిలీజుకి ముందే ఎందుకు రివ్యూలు అలాగే రేటింగులు డిసైడ్ అయిపోతున్నాయ్.? వివరాల్లోకి వెళితే విస్తు గొలిపే విషయాలు తెలుస్తాయ్.!
‘వాల్తేరు వీరయ్య’ సినిమా సమయంలో చిరంజీవి, రేటింగుల మీద సెటైర్లు వేశారు. రెండున్నర రేటింగు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ వెబ్ సైట్ నిర్వాహకులకి కోపం తెప్పించిందట.

సినిమా అంత పెద్ద హిట్ అయినా, రేటింగ్ అంత తక్కువ ఎందుకు వేశాం.? అన్న ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి, ఆ పైత్యాన్ని ‘భోళా శంకర్’ మీద చూపించబోతున్నారట.
ఇక, ఇంకో వైబ్ సైట్ తీరు మరీ ఆశ్చర్యకరం. ఆ వెబ్ సైట్‌కి ఫండింగ్ చేస్తోన్న ఓ రాజకీయ పార్టీ, ఇటు పవన్ కళ్యాణ్ ఉనికినిగానీ, అటు చిరంజీవి ఉనికినిగానీ జీర్ణించుకోలేకపోతోంది.
రాజకీయ పైత్యం..
ఆ కారణంగానే, ఆ రాజకీయ పార్టీ ఆదేశాలతో ‘బ్రో’ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేసినట్లే, ‘భోళా శంకర్’ మీద కూడా విషం చిమ్మబోతున్నారట.
రివ్యూలు, రేటింగుల్ని బట్టి సినిమాలు ఆడటం, ఆడకపోవడం అనేది వుండదు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సక్సెస్ ఇందుకు నిదర్శనం.
More At: ఖుషీ.. ఖుషీగా.! సమంత, విజయ్.. రొమాంటిక్ టచ్.!
కాకపోతే, కొంత నష్టం అయితే ఈ రివ్యూలు, రేటింగుల వల్ల ఎగ్జిబిటర్లకు కలుగుతుంది. నిర్మాతలూ కొంత నష్టపోయే అవకాశాల్లేకపోలేదు.
ప్రత్యేక కథనాలతో ‘భోళా శంకర్’ మీద అప్పుడే దుష్ప్రచారం మొదలైంది. ట్వీట్ రివ్యూలతో మరింత ఛండాలన్ని చూడబోతున్నాం.!