Bhumi Pednekar Dressing Style.. ‘వాళ్ళకి నేనేం చేసినా తప్పే’ అంటోంది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్.! ‘ఏమీ చేయకపోయినా నన్ను తప్పు పడతారు’ అంటూ వాపోయింది ఈ బ్యూటీ.
అసలు విషయమేంటంటే, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మీడియా ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా పై విధంగా స్పందించింది భూమి పెడ్నేకర్.
కొందర్ని మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ చేస్తారు.? అందర్నీ ఎందుకు ట్రోల్ చేయరు.? అని ప్రశ్నిస్తే, ‘కాయలున్న చెట్టు మీదకే కదా రాళ్ళు వేసేది..’ అంటూ భూమి పెడ్నేకర్ సమాధానమిచ్చింది.
థాంక్యూ ఫర్ కమింగ్..
భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) తన తాజా సినిమా ‘థాంక్యూ ఫర్ కమింగ్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మీడియా ముందుకొచ్చింది.

సహజంగానే, తనకు అస్సలు సూట్ అవని డ్రెస్సులో కనిపిస్తూ, ఒకింత ఇబ్బందికరంగా మారిందామె.! భూమి పెడ్నేకర్ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో తరచూ ట్రోలింగ్ జరుగుతుంటుంది.
బాలీవుడ్‌లో మోస్ట్ వరస్ట్ డ్రెస్టింగ్ స్టైల్ భూమి పెడ్నేకర్‌దేనంటూ తరచూ ఓ వాదన వినిపిస్తుంటుంది.
Bhumi Pednekar Dressing Style.. అది నా ఇష్టం..
‘నా డ్రెస్సింగ్ నా ఇష్టం..’ అని అంటోన్న భూమి పెడ్నేకర్, ‘స్టైలింగ్ తెలియనివాళ్ళే నన్ను ట్రోల్ చేస్తారు..’ అంటూ బుకాయించే ప్రయత్నం చేసింది.
Also Read: కలర్స్ స్వాతి డివోర్స్ గోలేంటి.?
పొట్టి బట్టలేసుకున్నా ట్రోల్ చేస్తారనీ, చీర కట్టుకున్నా ట్రోల్ చేస్తూనే వుంటారనీ, అందుకే ట్రోలింగుని పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది భూమి పెడ్నేకర్.
అన్నట్టు, భూమి పెడ్నేకర్‌కి సౌత్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయట. త్వరలో సౌత్ సినిమాల్లో కనిపిస్తానని అంటోంది.