Table of Contents
Bhumi Pednekar Over Workouts.. అతి సర్వత్ర వర్జయేత్.. అన్నారు పెద్దలు.! ‘అతి’ అస్సలు చెయ్యకూడదన్నది దాని అర్థం.!
అసలు ‘అతి’ అంటే ఏంటి.? ‘అతి’గా మాట్లాడటం, ‘అతి’గా తినడం, ‘అతి’గా ఏదైనా చేయడం.. ఇదన్నమాట ‘అతి’ అంటే.!
అవసరానికి మించి ఏది చేసినా, దాన్ని ‘అతి’ అనే అనాల్సి వుంటుంది. అది ఆహారం తీసుకోవడమైనా, వ్యాయామం చేయడమైనా.!
అతిగా తింటే ఏమవుతుంది.? ఊబకాయం వస్తుంది. దాంతో, అనేక రకాలైన అనారోగ్య సమస్యలు. మరి, అతిగా వ్యాయామం చేస్తేనో.?
జీరో సైజ్.. కొంప ముంచేసింది..
హీరోయిన్లు, జీరో సైజ్‌లో కనిపించడం కోసం, తిండి మానేసి వర్కవుట్లు చేయడం కొత్తేమీ కాదు. రకరకాల సర్జరీలు చేయించుకుని, సన్నబడినవారూ లేకపోలేదు.

అలా, కొన్ని వైద్య చికిత్సలు చేయించుకుని.. శరీరాన్ని నాజూగ్గా వుంచుకునేందుకు ప్రయత్నించిన కొందరు అందాల భామలు, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ వున్నాయ్.
వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన చికిత్సలు, సొంత పైత్యంతో అనుభవం లేని వారి ద్వారా చేయించేసుకుని.. ప్రాణాలు కోల్పోయారు కొందరు సెలబ్రిటీలు.
వ్యాయామం కూడా అంతే సుమీ..
అతి వ్యాయామం అస్సలు మంచిది కాదు. వర్కవుట్స్ చేస్తూ, చాలామంది ప్రాణాలు కోల్పోతుండడమే ఇందుకు నిదర్శనం.
సెలబ్రిటీలు, జిమ్‌లలో ఎక్కువ సమయం గడుపుతూ, సంబంధిత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు.
Also Read: మండల మర్డర్స్ రివ్యూ: న్యూక్లియర్ సైంటిస్టు.. మూఢ నమ్మకాలూ.!
వీరిలో కొందరు, తీవ్ర అనారోగ్యం పాలై, ‘అతి వ్యాయామం అత్యంత ప్రమాదకరం’ అని ఆ తర్వాత చెప్పడం కూడా చూస్తున్నాం.
కొందరు సెలబ్రిటీలు, అతి వ్యాయామం వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ వున్నాయ్ దురదృష్టవశాత్తూ.!
Bhumi Pednekar Over Workouts.. భూమి పెడ్నేకర్‌కీ తెలిసొచ్చింది..
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో, అతి వ్యాయామం తాలూకు అనర్థాల గురించి చెప్పింది.
ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అంటారట.. ఇలా అతిగా వ్యాయామం చేసేవాళ్ళకి తలెత్తే సమస్యని. ఆ సమస్య తలెత్తాక, వ్యాయామం తగ్గించేశానని భూమి పెడ్నేకర్ చెప్పింది.
‘సెలబ్రిటీలుగా మేం, ఫిట్‌గా వుండాలి.. కొన్ని పాత్రల కోసం కష్టతరమైన వ్యాయామాలు చేస్తాం. ఆ తర్వాత అది తెచ్చే సమస్య.. అంతా ఇంతా కాదు’ అని భూమి పెడ్నేకర్ వివరించింది.

మజిల్స్ సమస్యలు సహా అనేక అనారోగ్య సమస్యలు, ఈ ‘ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్’ కారణంగా తలెత్తుతుంటాయి. కొందరిని అవి దీర్ఘకాలం వేధిస్తుంటాయి.
వేగంగా బరువు తగ్గేందుకు చేసే కఠినతమైన వర్కవుట్లు, ప్రాణాలు తీసేస్తుంటాయ్.
ఒక్కోసారి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వ్యాయామానికి దూరమైతే, ఆ తర్వాత పెరిగే బరువు వల్ల కూడా మరిన్ని సమస్యలొస్తాయ్.