బుల్లితెర చరిత్రలో బిగ్ బాస్ (Big Boss Telugu 3 Nagarjuna) రియాల్టీ ఓ సంచలనమే.. కానీ, బిగ్ హౌస్‌లోకి ఎవరు వెళ్ళినాసరే, ‘బ్యాడ్ ఇమేజ్’ మూటగట్టుకోవాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హోస్ట్‌గా వ్యవహరించిన తొలి సీజన్ తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఈ విషయంలో ది బెస్ట్.
నాని (Natural Star Nani) హోస్ట్‌గా పనిచేసిన రెండో సీజన్ నుంచి అసలు కథ మొదలైంది. చాలామంది కంటెస్టెంట్స్ మీద ‘బ్యాడ్’ ఇంప్రెషన్ వేసేసి, ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మూడో సీజన్ మరీ దారుణం. కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ మూడో షోకి హోస్ట్ కావడంతో, వివాదాలకు తావివ్వకుండా షో నడస్తుందేమోనని బుల్లితెర వీక్షకులు భావించారు.
కానీ, నాగార్జున సైతం ‘బ్యాడ్’ కాన్సెప్ట్‌ని మార్చలేకపోయాడు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచే ‘బ్యాడ్’ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి, ఓట్లు తక్కువ వచ్చిన హేమ (Actress Hema) మొదటి వారం ఎలిమినేట్ అయిపోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆమె క్యారెక్టర్ మీద ‘బ్యాడ్’ ఇంప్రెషన్ వేసేసింది బిగ్ బాస్ రియాల్టీ షో.
హౌస్ మేట్స్ అందరి చేతా చీటీలు రాయించి, అందులో హేమని ‘బ్యాడ్’గా తేల్చేసి.. హేమని బయటకు గెంటేశారు. సీనియర్ నటి హేమ (Big Boss Telugu 3 Nagarjuna), సీనీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హౌస్‌లో మాటలు జారేయడం, చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణమే. కానీ, వాటిని పట్టుకుని సీనియర్ నటి మీద ఎలా ‘చెడు’ ముద్ర వేసేస్తారు.?
హౌస్ మేట్ దృష్టిలో హేమ బ్యాడ్.. అంటే అది వేరే విషయం. కానీ, ఓటింగ్‌లోనూ ‘బ్యాడ్’ అని తేల్చేశారు. హౌస్ మేట్స్ నిర్ణయం లాగానే ఓటింగ్‌లోనూ జనం అదే నిర్ణయాన్ని బయటపెట్టారంటూ నాగార్జున, హేమని ‘వెరీ వెరీ బ్యాడ్’ (Big Boss Telugu 3 Nagarjuna) చేసేశాడు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి సంబంధించిన ఎన్నికల్లో హేమ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. ఆమె రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటున్నారు.
సరిగ్గా ఈ టైమ్‌లో ఈ ‘బ్యాడ్ ఇంప్రెషన్’ హేమపై వేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఓటింగ్‌లో హేమకి తక్కువ ఓట్లు వచ్చాయంతే. ఆమెని బ్యాడ్ అనే హక్కు మీకెవరిచ్చారు.? అంటూ నాగార్జునని అంతా ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇక్కడ నాగ్ చేసేదేమీ లేదు.. అంతా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోంది. హేమ ఎలిమినేషన్‌తో బిగ్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఇంకొకర్ని పంపించారు. ఆ ఇంకొకరు ఎవరో కాదు, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి (Transgender Tamannah Simhadri).
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండేందుకు ప్రయత్నించే శ్రీరెడ్డితో గతంలో తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) సావాసం అందరికీ తెల్సిన విషయమే. ఆ తర్వాత శ్రీరెడ్డి తీరు నచ్చక ఆమెకు దూరమైపోయారు తమన్నా సింహాద్రి. హౌస్‌లోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ తర్వాత ఖచ్చితంగా సీన్ మారిపోతుంది.
రంగు మీదనే జుగుప్సాకరమైన కామెడీ చేసుకున్న బిగ్ హౌస్‌మేట్స్, తమ మధ్యకు వస్తున్న ట్రాన్స్ తమన్నా సింహాద్రి విషయంలో ఎలా వ్యవహరిస్తారు.? ఇక్కడ ఇంకెంత జుగుప్సాకరమైన సన్నివేశాలు చూడబోతున్నాం.? ఏమో, తలచుకుంటేనే చాలామందికి జుగుప్సాకరమైన భావన కలుగుతోంది.
ఇదిలా వుంటే, తొలి వీకెండ్ నాగార్జున (King Akkineni Nagarjuna) ఎలా హోస్టింగ్ చేశారు.? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
నాగ్ హోస్టింగ్ బాగానే వుందనేవారి సంఖ్య తక్కువగా కన్పిస్తోంది. ఫర్వాలేదనే మాట ఎక్కువగా విన్పిస్తోంది. బ్యాడ్ అనే వాయిస్ కూడా వస్తోంది కొందరి నుంచి. అయితే ఇది తొలి వీకెండ్ గనుక, నాగ్ హోస్టింగ్‌ని ఇప్పుడే జడ్జ్ చేసెయ్యలేం. వెండితెర మన్మథుడు (Manmadhudu2 Nagarjuna) కదా, డ్రెస్సింగ్ విషయానికొస్తే.. యంగ్ టైగర్‌ని మించిపోయాడు. నాని ఈ విషయంలో వెరీ బ్యాడ్ అనుకోండి.. అది వేరే సంగతి.
వీకెండ్ కోసం కంటెస్టెంట్స్ చాలా గ్లామరస్‌గా కన్పించారు. పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam), మన్మథుడు నాగార్జున నుంచి అప్రీషియేన్స్ పొందింది గ్లామర్ విషయంలో. శ్రీముఖి (Sree Mukhi) యాజ్ యూజువల్ అదరగొట్టేసింది. సాంగ్స్‌కి సంబంధించిన టాస్క్‌లో రోహిణి (Rohini) దుమ్ము రేపేసింది. అన్నట్టు, ఎలిమినేషన్ తర్వాత హేమ ఎవరి మీదా ‘బాంబ్’ వెయ్యలేదు. ‘తోపు..’ అంటూ తనను బయటకు తోసేశారని వాపోయింది. తనను హౌస్‌మేట్స్ ఎవరూ అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏదిఏమైనా, అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. బిగ్ రచ్చకి (Big Boss Telugu 3 Nagarjuna) అంతా సిద్ధమయిపోవాల్సిందే. ‘ఇకపై బిగ్‌బాస్‌ని చూడటం దండగ’ అంటూ నాగార్జునని ఓ రేంజ్‌లో హేటర్స్ ట్రోల్ చేస్తుండడం కొసమెరుపు.