పాపం కుమార్ సాయి (Bigg Boss Telugu 4 Kumar Sai Soft Target) బలైపోయాడు.. హారికని (Alekhya Harika) అడ్డగోలుగా టార్గెట్ చేసేశారు.. మోనాల్ గజ్జర్ (Monal Gajjar) ఇంకోసారి నామినేషన్ రేసులోకి వచ్చింది.
దేవి నాగవల్లిని (Devi Nagavalli) కరాటే కళ్యాణి (Karate Kalyani) ‘బిగ్ బాంబ్’ ద్వారా డైరెక్ట్‌గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త కెప్టెన్ నోయెల్ సీన్ (Noel Sean), లాస్యని (Lasya Manjunath) నేరుగా నామినేట్ చేయడం గమనార్హం.
మెహబూబ్ (Mehboob Dilse), అరియానా (Ariyana Glory) కూడా ‘సెగ’ ఎదుర్కొన్నారు నామినేషన్ల ప్రక్రియలో. సో, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం మొత్తం ఏడు మంది నామినేట్ అయ్యారన్నమాట. ఒక్కో కంటెస్టెంట్, తమకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్ ఫొటోల్ని ‘మంటల్లో కాల్చేయడం’ ద్వారా ఈ నామినేషన్ ప్రక్రియ చేపట్టారు.
నామినేషన్ పర్వం కోసం ‘జెన్యూన్ రీజన్స్’ వుండాలి. కానీ, ఇక్కడ చాలామంది ఆ పద్ధతి పాటించలేదు. కుమార్ సాయిని అర్థం పర్థం లేకుండా కొందరు నామినేట్ చేస్తే, కొందరు సరైన రీజన్‌తోనే నామినేట్ చేశారు. అఖిల్, సోహెల్ ముందే నిర్ణయించుకుని ఒకే రీజన్‌తో కుమార్ సాయిని నామినేట్ చేయడం గమనార్హం.
మొత్తంగా నామినేషన్ పర్వం సందర్భంగా కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. సుజాత – హారిక, మోనాల్ గజ్జర్ (Monal Gajjar)- దివి (Divi Vadthya), అఖిల్ (Akhil Sarthak)- కుమార్ సాయి, సోహెల్ – కుమార్ సాయి, అరియానా – సోహెల్ (Syed Sohel) మధ్య ప్రధానంగా రచ్చ చోటు చేసుకుంది.
‘ఇప్పటిదాకా మన మధ్య సరైన కమ్యూనికేషన్ కుదరలేదు. ఇకపై కుదురుతుందని ఆశిస్తున్నా..’ అంటూ అమ్మ రాజశేఖర్ ఫొటోని తగలెయ్యడం ద్వారా గ్యాప్‌ని మరింత పెంచేసుకుంది దేవి నాగవల్లి. దివి – అమ్మ రాజశేఖర్ విషయంలో అర్థం పర్థం లేని జుగుప్సాకరమైన కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న లాస్య, ఆ కారణంగానే కెప్టెన్ నోయెల్ ద్వారా డైరెక్ట్‌గా నామినేట్ అవడం మరో ఆసక్తికర అంశం.
ఏదిఏమైనా, ఈ గొడవలన్నీ హౌస్ వరకేనని గతంలో జరిగిన మూడు సీజన్స్ (Bigg Boss Telugu) నిరూపించాయి. గత సీజన్స్‌ని ఫాలో అయి హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్, అంతకంటే చెత్త ఆలోచనలతో ఎలా హౌస్‌లో ‘గలాటా’ సృష్టించగలుగుతున్నారో ఏమో.! ఇదిలా వుంటే, ఫొటోల్ని గంగవ్వ కూడా కాల్చేసింది. కానీ, ఇలా కాల్చేయడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పింది. నిజమే, ఫొటోల్ని కాల్చేయడమేంటి నాన్సెన్స్ కాకపోతే.!