Table of Contents
Bigg Boss Non Stop పేరుతో మళ్ళీ ‘బిగ్’ (Bigg Boss Telugu) సందడి షురూ కాబోతోంది. ఓ ఇంట్లో కంటెస్టెంట్లను కొన్ని రోజులపాటు వుంచేసి, వారికి బాహ్య ప్రపంచంతో సంబందం లేకుండా చేసి.. ఆ ఇంట్లో ఆటలాడించడొ, కొట్లాటలు పెట్టడం.. ఇదీ బిగ్ బాస్ అంటే.
బయటకు వచ్చాక కనీ వినీ ఎరుగని స్థాయిలో పాపులారిటీ పెరిగిపోతోందహో.. అనే ప్రచారం షరామామూలే. నిజమే, కొందరు స్టార్లయ్యారు.. కొందరి అడ్రస్ గల్లంతవుతుంటుంది. అదే బిగ్ బాస్ మాయ అంటే.
అన్నట్టు, ఈ బిగ్ బాస్ పుణ్యమా అని రియల్ లైఫ్‌లో కూడా అత్యంత దారుణమైన ఇమేజ్‌ని క్యారీ చేయాల్సి రావొచ్చు. అంతలా ఆయా వ్యక్తుల మీద వ్యూయర్స్ ఏహ్యభావం పెంచేసుకోవడాన్నీ చూస్తున్నాం.
Bigg Boss Non Stop.. ఈసారి ఏకంగా 24 గంటలట.!
ప్రతిరోజూ ఓ గంట సమయం బిగ్ బాస్ కోసం సమయం వెచ్చించడమంటే అదో వృధా ప్రయాస అయిపోయింది. మొదటిది ఫర్లేదు.. రెండోదీ. ఓకే.. మూడో సీజన్‌కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ పూర్తిగా గల్లంతయ్యింది.! ఆ తర్వాత ‘మమ’ అన్పించేస్తున్నారంతే.
అలాంటిది, ఈసారి ఏకంగా రోజంతా బిగ్ బాస్ చూసే అవకాశమట. 24 గంటల పాటు హౌస్‌లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూసే అవకాశమంటే, అసలు దాన్ని చూసేదెవరు.? అన్న చర్చ తెరపైకి రావడం సహజమే.
నేరుగా మీ ఇంట్లోకే.. కండిషన్స్ అప్లయ్.!
మీ ఇంట్లోకి, మీ మొబైల్ ఫోన్లలోకి.. నేరుగా బిగ్ బాస్ (Bigg Boss) వచ్చేసింది. అయితే, ఇది ఓటీటీ కంటెంట్ మాత్రమే. అంటే, చూడకూడనివి ఏమైనా వుంటాయా.? అనడక్కండి. ‘అరాచకం’ అనదగ్గవి ఇప్పటికే చూసేశాం.
Also Read: కొత్త ప్రవచనం: హీరో అంటే అలా వుండకూడదట పుష్పా.!
ఇంతకీ, ఈ ఇరవై నాలుగ్గంటల ప్రయోగం ఫలిస్తుందా.? వికటిస్తుందా.? అంటే, ఇదైతే తెలుగు వీక్షకులకి కొత్త వ్యవహారమే. మొన్నామధ్య హిందీలో ఈ ప్రయోగం చేశారు. పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాల్లేవ్.
మళ్ళీ నాగార్జునే హోస్ట్.!
ప్చ్.. మళ్లీ అదే నాగార్జునని (Akkineni Nagarjuna) హోస్ట్‌గా చూడాల్సి వస్తుందిప్పుడు. అంతేనా, కంటెస్టెంట్లలోనూ కొందరు పాత వాళ్ళే వుంటారట. వారికి కొత్త వాళ్ళు కొందరు అదనంగా వుంటారట. వాళ్ళెవరన్నదానిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో వున్నాయ్.
చూసుకున్నోడికి చూసుకున్నంత.. తిట్టుకున్నోడికి తిట్టుకున్నంత.. దటీజ్ బిగ్ బాస్ (Bigg Boss Telugu) నాన్ స్టాప్.!
కొసమెరుపేంటంటే, కంటెస్టెంట్లుగా ఇప్పటికే ఖరారైనవాళ్ళంతా తమ తమ పీఆర్ బృందాల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేసుకున్నారట. దానికోసం భారీగా ఖర్చు చేయడం తప్పదనుకోండి.. అది వేరే సంగతి.
రోజుల తరబడి బిగ్ హౌస్‌లో వుండి, బయటి సమాజంతో సంబంధాలు తెంచేసుకుని, షో నిర్వాహకులు చెప్పినట్టల్లా ఆటలాడి, వేషాలేసి, కొట్లాటల్లో పాల్గొని.. చివరికి ఎంత రెమ్యునరేషన్ అందుకుంటరోగానీ, ‘సొంత ప్రచారం’ కోసం పీఆర్ బృందాలకు కనీ వినీ ఎరుగని రీతిలో ఖర్చు చేయడం అయితే తప్పనిసరి.
అప్పుడే, ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్.. యాక్టివేట్ అయిపోయాయ్.! ప్రత్యర్థి కంటెస్టెంట్ల మీద బురద చల్లడంలో సోకాల్డ్ కంటెస్టెంట్ల అభిమానులు (పెయిడ్ బ్యాచ్) కూడా సంసిద్ధమే.!