ఓట్లు పోటెత్తేస్తున్నాయ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభమయ్యాయని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున ఇలా ప్రకటించాడో లేదో అలా అబిజీత్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అబిజీత్‌కి (Bigg Boss Telugu 4 Winner Abijeet) వెయ్యాల్సిన ఓట్లను వేసేస్తున్నారు అతని అభిమానులు.
హాట్ స్టార్ యాప్‌లోనూ, మిస్‌డ్ కాల్స్‌తోనూ.. ఎడా పెడా ఓట్లు కుమ్మేస్తున్నారంతే. ఇంకోపక్క అబిజీత్ (Team Abijeet) పేరుతో హ్యాష్ ట్యాగ్‌లను కుప్పలు తెప్పలుగా వైరల్ చేసేస్తున్నారు. అబిజీత్ బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ (Bigg Boss Telugu 4) ప్రారంభమయినప్పటినుంచి ఏ వారం అబిజీత్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయినా, రికార్డు స్థాయి ఓట్లతో అతన్ని గెలిపిస్తూ వచ్చారు అభిమానులు. మధ్యలో అబిజీత్‌తోపాటు, అబిజీత్‌కి దగ్గరగా వుండే ఇంకొందరు కంటెస్టెంట్స్ కోసం కొన్ని ఓట్లు త్యాగం చేశారు కూడా.

అయితే, ఇప్పుడిది టైటిల్ విన్నింగ్ రేస్. ఈసారి ఎలాంటి ‘డైవర్షన్స్’కీ తావు లేకుండా అబిజీత్ (Abijeet Duddala) అభిమానులు పక్కా ప్లానింగ్‌తో ఓట్లు వేస్తున్నారు. గత వారం పది రోజులుగా మరింత అగ్రెసివ్‌గా అబిజీత్‌ని సపోర్ట్ చేస్తున్న అతని అభిమానులు, ఈరోజు ఆ జోరు మరింత పెంచేశారు.
ఇంకోపక్క అబిజీత్ కూడా హౌస్‌లో ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. మోనాల్ ఔట్ అయిపోవడంతో, అభిజీత్‌లో కొత్త ఎనర్జీ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే, మోనాల్ కారణంగానే అబిజీత్ ఎనర్జీలో కొంత ‘లో’ ఏర్పడింది. దానిక్కారణం అందరికీ తెల్సిందే.
మోనాల్ (Monal Gajjar) పేరు చెప్పి, అబిజీత్‌ని ఇరికించే ప్రయత్నాలు అటు బిగ్‌బాస్ టీమ్, ఇటు హోస్ట్ నాగార్జున (King Akkineni Nagarjuna) చాలా సార్లు చేశారు. ఇప్పుడిక ఆ ఛాన్స్ లేదు. అఖిల్‌కి, హౌస్‌లో ఇంకెవరితోనూ గొడవలుండవ్. నిజానికి, ఎవరితోనూ గొడవపడే వ్యక్తి కాదు అబిజీత్.
అయినాగానీ, మోనాల్ పేరు ఏదోలా ప్రస్తావనకు తీసుకొచ్చి, అబిజీత్ (We Admire Abijeet) ఇరికించడం చాలామందికి చాలా అలవాటైపోయింది.. బిగ్‌బాస్ సహా. మొత్తమ్మీద, అబిజీత్.. గ్రాండ్ ఫినాలె సందర్భంగా రికార్డు స్థాయి ఓట్లతో టైటిల్ (Bigg Boss Telugu 4 Winner Abijeet) కొల్లగొట్టేయబోతున్నాడన్నమాట.