Bigg Boss Telugu 5 Adults Only.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీతో ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సరయు బూతులు మాట్లాడేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదు నుంచి తొలి ఎలిమినేషన్ సరయుదే. ఎలిమినేట్ అయ్యాక, అరియానా ముందు ఇంటర్వ్యూకి హాజరైంది సరయు. ఈ క్రమంలో సరయు నోట అలవోకగా బూతులొచ్చేశాయ్.
షణ్ముఖ్ జస్వంత్ మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది సరయు. అంతేనా, ‘మొగోడు..’ అంటూ పదే పదే అభ్యంతరకర వ్యాఖ్యలు పలువురు కంటెస్టెంట్ల మీద సరయు చేసింది. ఇది బిగ్ బాస్ వీకెండ్ తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూలో బూతుల ప్రవాహం.
Also Read: డర్టీ వికెట్.. సరయు ఓవరాక్షన్.. రీ-ఎంట్రీ నిజమా.?
రెండో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రకియలో రచ్చ మరో స్థాయిలో కనిపించింది. ఒకరిద్దరు మినహా కంటెస్టెంట్లంతా ఓవరాక్షన్‌తో చెలరేగిపోయారు. ఉమా దేవి అయితే ఏకంగా బూతులు మాట్లాడేసింది. ఆ బూతుల్ని కంటెస్టెంట్లు భరించలేకపోయారు. షణ్ముఖ్ అయితే, ఈ బూతుల ప్రవాహాన్ని తీవ్రంగానే ఖండించాల్సి వచ్చింది.
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ రాత్రి 10 గంటలకు ప్రసారం.. అన్నప్పుడే చాలామందికి డౌట్ వచ్చింది.. ఇది ‘పెద్దలకు మాత్రమే’ టైపు షో అని. ఆ అనుమానమే నిజమవుతోందిప్పుడు. కంటెస్టెంట్లు అలా బూతులు మాట్లాడేస్తోంటే బిగ్ బాస్ ఎందుకు హెచ్చరించడంలేదు.? హెచ్చరించడానికేముంది.. ఎంకరేజ్ చేస్తున్నదే బిగ్ బాస్.
Also Read: ఏంట్రా ఇది.. ఆలుగడ్డ కూర కోసం ‘బిగ్ బాస్’కి వచ్చారా.!
అప్పటిదాకా నీతులు చెప్పిన శ్వేతా వర్మ.. ఒక్క క్షణం సంయమనం కోల్పోయింది. హమీదా మీద ‘దాడి’ చేసినట్లుగా.. చెంప పగలగొట్టినట్టుగా రంగులు పూసి నామినేట్ చేసింది. ఆ తర్వాత క్షమాపణ చెప్పిందనుకోండి.. అది వేరే సంగతి.
మొత్తమ్మీద, ఒకర్ని మించి ఇంకొకరు స్క్రీన్ స్పేస్ కోసం చెలరేగిపోతున్నట్టున్నారు. అలా చెలరేగిపోవాలని వాళ్ళకి ముందే చెప్పి పంపించారా.? అదే వాళ్ళ గేమ్ స్ట్రాటజీనా.? ఏమోగానీ, దయచేసి పిల్లలతో కలిసి మాత్రం బిగ్ బాస్ (Bigg Boss Telugu 5 Adults Only) చూడొద్దనే సంకేతాల్నయితే పంపించేస్తున్నాడు బిగ్ బాస్.