Table of Contents
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజే వేరు. ఎంటర్టైన్‌మెంట్ ఉన్నా, లేకున్నా బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే చాలు ఆడియన్స్‌లో నెలకొనే ఆ ఉత్సాహం, ఉత్సుకత వేరే లెవల్ అంతే. ఏ సీజన్‌కి ఆ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా (Bigg Boss Telugu 5 Contestants List) వచ్చే సెలబ్రిటీల విషయంలో ముందుగానే రకరకాల గాసిప్స్ వస్తుంటాయి.
ఆ గాసిప్స్ లో కొన్ని నిజం కావచ్చు. కొన్ని నిజం కాకపోవచ్చు. షో మొదలవ్వక ముందే, ఈ గాసిప్స్ కూడా ఆడియన్స్‌ని విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలా లేటెస్ట్ సీజన్‌కి సంబంధించి కొన్ని హాట్ హాట్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: యూ ట్యూబర్స్.. సిగ్గూ ఎగ్గూ వదిలేశారంతే.!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 (Bigg Boss Telugu 5) లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హాట్‌నెస్ ఉండబోతోందనీ, అందుకు కారణం ఇదిగో ఈ సెలబ్రిటీలే అంటూ ఈ మధ్య సోషల్ కోడి తెగ కూత పెట్టేస్తోంది. అసలింకీ సోషల్ కోడి ఆ రేంజ్‌లో కూత పెట్టడానికి కారణం ఎవరో తెలుసా.? బుల్లితెరపై ఈ మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీలు దీపికా పిల్లి, వర్షిణి వీరిలో ఎవరైతే లేటెస్టు సీజన్‌కి ఫిట్.. వీరిలో ప్లస్సులు ఏంటీ.? మైనస్సులు ఏంటీ.?
హాట్ హాట్ వర్షిణి..
నిజానికి వర్షణి (Varshni Sounderajan)చాలా కాలం నుండే యాంకర్‌గా బుల్లితెరపై సత్తా చాటుతోంది. బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్లుగా చెప్పుకునే అనసూయ, రష్మిల తర్వాతి స్థానాన్ని వర్షిణి దక్కించుకుందనే చెప్పాలేమో. హాట్ అప్పీల్ లో వర్షిణి తనదైన ముద్ర వేసుకుంది. మొదట్లో డాన్సులు కొంచెం వీక్ అనిపించినా, తర్వాత డెవలప్ అయిపోయింది.
ఇక ఫాలోయింగ్ విషయానికి వస్తే, కుర్రకారుకు గిలిగింతలు పెట్టడంలో వర్షిణి ఈ మధ్య బాగా ముదిరిపోయింది. ఈ మధ్య ఓ షోలో పొట్టి నిక్కరేసుకుని వచ్చి, తనపై తానే కామెంట్లు వేసుకుని కుర్రకారుకి కాక పుట్టించేసింది. ఈ ప్లస్ పాయింట్లు చాలవా బిగ్‌బాస్ సెలబ్రిటీ అనిపించుకోవడానికి.
Also Read: అందం.. అనసూయ.. ఆత్మవిశ్వాసం.!
వయ్యారాల దీపికా పిల్లి..
సోషల్ మీడియాలో డాన్సులతో పాపులర్ అయిన దీపికా పిల్లి (Deepika Pilli) ఈ మధ్య బుల్లితెరపై సరికొత్త హవా చాటుతోంది. రష్మికి తోడుగా ఓ డాన్సు ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేస్తోంది. రష్మి – సుధీర్ జంట ఓ పక్క డామినేట్ చేస్తుండగానే, ఆదితో జత కట్టి, తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
క్యూట్‌గా పంచ్‌లు విసరడమే కాదు, అందాలారబోతలోనూ రష్మికి గట్టిగా పోటీ ఇస్తోంది దీపికా పిల్లి. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ దీపిక. వర్షిణితో పోల్చితే, స్ర్కీన్ ఎక్స్‌పీరియన్స్ తక్కువే అయినా, గ్లామర్ అలాగే క్రేజ్ ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి.
మొత్తమ్మీద బిగ్ బాస్ రియాల్టీ షో ఐదో సీజన్ విషయమై జరుగుతున్న ముందస్తు ప్రచారానికి తగ్గట్లుగా వీరిద్దరిలో బిగ్ హౌస్‌లో (Bigg Boss Telugu 5 Contestants List Varshini Deepika) నిజంగా అడుగు పెట్టేదెవరో.. జస్ట్ పబ్లిసిటీతోనే సరిపెట్టుకునేదెవరో.. చూడాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.