Bigg Boss Telugu 5 అసలు ఈ నామినేషన్ల గోలేంటి.? ఎవరు ఎవర్ని ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ప్రేక్షకులు ఇలా అనుకుంటుండగానే, ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతూ వుంటారు. అదే మ్యాజిక్. ఎవరు ఓట్లేస్తున్నారు.? ఎందుకు ఓట్లేస్తున్నారు.? అన్నది కూడా తెలియదు. ఓట్లు వేస్తున్నారో లేదో కూడా డౌటే.
షో మొదలైన మరుసటి రోజే నామినేషన్స్ షురూ అయ్యాయి ఎలిమినేషన్ కోసం. రేసులో ఆరుగురు నిలబడ్డారు. అందులో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ వుంటుందా.? డబుల్ ఎలిమినేషన్ తప్పదా.? అన్న డౌట్స్ వుండనే వున్నాయ్.
వాళ్ళంతా సేఫ్.. ఎనీ డౌట్స్.?
యాంకర్ రవి, ఆర్జే కాజల్, జస్వంత్ పడాల (జెస్సీ), హమీదా, మానస్, సరయు.. ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యులు. వీరిలో యాంకర్ రవి సేఫ్ అయిపోవచ్చు. ఎందుకంటే, రవికి బోల్డంతమంది ఫాలోవర్స్ వున్నారు.
ఆర్జే కాజల్ విషయానికొస్తే, ‘పీఆర్’ బాగా వర్క్ చేస్తోంది ఆమె కోసం. మానస్ కూడా ఫాలోవర్స్‌ని బాగానే కలిగి వున్నాడు. మిగిలింది జస్వంత్ (జెస్సీ), హమీదా, సరయు. ఈ ముగ్గురిలో హమీదా పరిస్థితే కొంత డల్‌గా వున్నట్టుంది.
నిజంగానే ఓట్లేస్తారా.?
సో, ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి చూస్తే హమీదా వికెట్ పడిపోవచ్చు. కానీ, బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే బోల్డంత గందరగోళం. ఆమెకు బదులుగా ఇంకెవర్నయినా బలి చేస్తారా.? అన్నదే వేచి చూడాల్సిన అంశమిక్కడ. అన్నట్టు, హమీదా బాగా ఏడ్చేస్తోంది.. ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నాడు జస్వంత్.
అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్ తరహాలో తయారయ్యారు హమీదా, జస్వంత్. సో, ఈ ఇద్దరూ సేఫ్.. అనే ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఏమో, ఏం జరుగుతుందో.. వీకెండ్ లోపు ఏ మ్యాజిక్ అయినా జరగొచ్చు. జస్ట్ వెయిట్ అండ్ సీ.