కొట్టుడు, తిట్టుడు, ఏడ్చుడు.. పిచ్చెక్కినట్లు అరుచుడు, వెర్రెక్కినట్లు నవ్వుడు.. బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తాం.? రాత్రి 9.30 గంటలకు రావల్సిన షో కాస్తా ఇంకో అరగంట వెనక్కి వెళ్లిందంటేనే, పిల్లల్ని పడుకోబెట్టేసి పెద్దాళ్లు మాత్రమే సూడండని.. సంకేతం ఇచ్చినట్లున్నారు సారు. అందుకే మళ్లా.. సరయు టీచరమ్మతో ‘మింగుడు’ (Bigg Boss Telugu 5 Sarayu Vulgarity) పాఠాలు చెప్పించిండు నాగ్ సారు.
అయినా ఈ ‘మింగుడు’ గోలేంటి.? అక్కినేని నాగార్జున అంటేనే డీసెంట్. మాస్ టచ్ ఉన్నా, క్లాస్ ఆడియన్స్ ఆయన్ని అమితంగా అభిమానిస్తారు. హౌస్‌లో ఏం జరిగినా, అది వేరే విషయం. సరయుతో బూతులు మాట్లాడించడం అస్సలు సబబుగా లేదు. ‘ఆ మింగుడేందీ.?’.
Bigg Boss Telugu 5 Sarayu Vulgarity సరయు బూతులు బాబోయ్..
గత సీజన్లలో కొట్లాటలు చూశాం. ఒక్కోసారి అదుపు తప్పి కంటెస్టెంట్లు తిట్టుకోవడం చూశాం. ఈ సారి జుగుప్సాకరంగా, నిస్సిగ్గుగా కంటెస్టెంట్లు బూతులు మాట్లాడేస్తారా.? అందుకే ఆ బూతుల్ని విచ్చలవిడిగా మాట్లాడగలిగే సరయుని దించారా.?
Also Read: Bigg Boss Telugu 5 ‘TOP 5’లో ఎవరుంటారు.?
సరయు అంటేనే, బూతుకు బ్రాండ్ అంబాసిడర్. యూ ట్యూబ్‌లో సరయు అని సెర్చ్ కొడితే, అదో బూతు ప్రవాహంలా కనిపిస్తాయి వీడియోలు. సరే, డైరెక్టర్ చెప్పాడు.. ఆమె ఆ వల్గర్ డైలాగులు చెప్పింది అనుకుంటే, అది వేరే సంగతి. బిగ్గెస్ట్ రియాల్టీ షో ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేసి, అందరూ చూడండహో.. అని ఆహ్వానించేసి, పిల్లలు, పెద్దలు అందరూ టీవీ సెట్ల ముందు కూర్చున్నాక, ఈ బూతులేంటీ.?
అన్నట్లు రాజకీయ నాయకులు నిత్యం వాడే బూతులకీ, బుల్లితెర వీక్షకులు ఎప్పుడో అలవాటు పడిపోయారు. వాళ్లతో పోటీ అన్నట్లుగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్లు తయారయ్యేలా ఉన్నారు.
Also Read: అతడు కాదు, ‘ఆమె’.. తప్పు ఏమున్నదబ్బా.?
చివరగా.. వాళ్ళంతా తిట్టుకోవాలి.. వీలైతే కొట్టుకోవాలి.. వెరసి, బుల్లితెర వీక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చెయ్యాలి. ఇదే బిగ్ బాస్ థీమ్. 100 రోజులకు పైగా ‘రొద’ తప్పదు మరి.. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో ఇది. ఇక్కడంతా ఇంతే.. అంతకు మించి.. అది వల్గారిటీ (Bigg Boss Telugu 5 Sarayu Vulgarity) కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. అంతేనా.?