Bigg Boss Telugu 5..ఎవరో విమర్శించాల్సిన పని లేదు.. జరుగుతున్నదేంటో వాళ్ళకీ తెలుసు. అందుకేనేమో, ‘ఇవే తగ్గించుకుంటే మంచిది..’ అంటూ వాళ్ళిద్దరే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కానీ, తప్పడంలేదు. ఇంతకీ, ఆ ‘ఇవి’ ఏంటి.? అంటే, మద్దులు, కౌగలింతలు.
సిరి హన్మంత్ (Siri Hanmanth).. యూ ట్యూబ్ సంచలనం. షన్నూ (Shannu) అలియాస్ షన్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) కూడా అంతే.. యూ ట్యూబ్ వ్యూయర్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు షన్నూ. అటు సిరికి బాయ్ ఫ్రెండ్ వున్నాడు.. ఇటు సన్నీకి గర్ల్ ఫ్రెండ్ వుంది.
వెండితెరపై రైటు.. బుల్లితెరపై రాంగూ.!
బిగ్ హౌస్‌లో తమ ఇద్దరి మధ్యా ‘ఎమోషనల్ కనెక్టివిటీ’ పెరిగిపోవడం పట్ల సిరి, షన్నూ.. ఇద్దరూ ఆందోళన చెందుతున్నారు. కానీ, ఏం లాభం.? తప్పదు.. ఫుటేజ్ కోసం డ్రమెటిక్ రిలేషన్ పండించాల్సిందే.

సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య పడక గది సీన్లు కూడా అత్యంత సహజంగా వుండేలా చిత్రీకరించేస్తుంటారు. అందులో తప్పు లేనప్పుడు, బిగ్ బాస్ రియాల్టీ షోలో మాత్రం, కంటెస్టెంట్లు అలా నటిస్తే తప్పేంటట.? తప్పే మరి.. ఎందుకంటే, ఇది నటన కాదు.. నిజ్జంగా నిజం.. అని షో నిర్వాహకులు చెబుతుంటారు.. కంటెస్టెంట్లూ అదే మాట చెబుతుంటారు.
Bigg Boss Telugu 5.. ఇది రియాల్టీ షోనా.?
ఎంత రియాల్టీ షో అయినా, అందులోనూ నటన తప్పనిసరి. బహుశా సిరి, షన్నూ చేస్తున్నది కూడా అదేనేమో. ఆ ‘కనెక్టివిటీ’ గురించి ‘ఆజ్యం’ పోస్తున్నట్టుగా హోస్ట్ నాగార్జునతో చెప్పించడం, ఆ తర్వాత అదే నాగార్జునతో క్లాస్ పీకించడం.. ఇవన్నీ బిగ్ బాస్ నిర్వాహకుల గేమ్ ప్లాన్ మాత్రమే.
Also Read: Samantha స్పెషల్ సాంగ్.. ఆ కిక్కే వేరప్పా.!
పునర్నవి – రాహుల్ సిప్లిగంజ్, మోనాల్ గజ్జర్ – అఖిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్ (Bigg Boss Telugu 5) రొమాంటిక్ కథలు చాలానే వుంటాయ్. అవి నిజమనుకుంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.