యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్‌లో (Bigg Boss Season One)లేదు.. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నేతృత్వంలో సాగిన బిగ్‌బాస్ సీజన్ రెండులో (Bigg Boss Season Two) కూడా లేదు. కానీ, అందరూ షాకయ్యేలా బిగ్‌బాస్ సీజన్ త్రీ ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తో (Varun Sandesh Vithika Sheru) బుల్లితెర వీక్షకుల్నే కాదు, ఇటు సినీ పరిశ్రమని కూడా ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ, ఆ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా.? హీరో వరుణ్ సందేశ్ (Hero Varun Sandesh), హీరోయిన్ వితికా షెరు.. (Vithika Sheru) ఈసారి బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరూ హౌస్‌మేట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో వింతేముంది.? అంటారా.! ఈ ఇద్దరూ భార్యాభర్తలు.
‘పడ్డానండి ప్రేమలో మరి’ (Paddanandi Premalo Mari) సినిమాలో ఈ ఇద్దరూ నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది.. ఆ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్ళి గురించి బిగ్ బాస్ (Bigg Boss Season 3 Telugu) స్టేజ్ మీద మాట్లాడుతూ, తానే తొలుత పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చానని వితిక వివరించింది. వరుణ్ (Varun Sandesh Vithika Sheru) తనను ప్రేమిస్తున్నట్లు తనకు అర్థమయ్యాక ఆలస్యం చెయ్యకుండా పెళ్ళి గురించి అడిగేశానని చెప్పింది వితిక. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా చెప్పుకొచ్చాడు వరుణ్ సందేశ్.
మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌లో చివరికి వరుణ్, వితిక (Varun Sandesh and Vithika Sheru) మాత్రమే మిగిలితే ఏం చేస్తారు.? అని నాగ్ ప్రశ్నిస్తే, వితిక ఏమాత్రం తడుముకోకుండా తానే గెలవాలనుకుంటున్నట్లు చెప్పింది. వరుణ్ మాత్రం, కొంచెం డిప్లమాటిక్‌గా సమాధానమిచ్చాడు. ‘నేను గెలవాలనుకుంటాను.. అదే సమయంలో, వితిక గెలిచినా.. అది తన గెలుపేనని అనుకుంటాను’ అని చెప్పడం గమనార్హం.
వరుణ్ సందేశ్ సమాధానానికి నాగ్ (King Akkineni Nagarjuna) కన్విన్స్ అయ్యాడుగానీ, వితిక చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు. అంతకు ముందు స్టేజ్ మీద వరుణ్, వితిక పెర్ఫామెన్స్ అదిరిపోయింది. చాలాకాలం తర్వాత వరుణ్ సందేశ్ అందరికీ కన్పించాడు.. ఓ వేదిక మీద. అదే అతని అభిమానులకి పెద్ద సర్‌ప్రైజ్.
బిగ్‌బాస్ ఈవెంట్ వేదిక నుంచి, హౌస్‌లోకి ఎంటర్ అయ్యే క్రమంలో తన భార్యని రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). అఫ్‌కోర్స్, ఆ చిలిపి ఆలోచన నాగార్జునదేననుకోండి.. అది వేరే సంగతి. మొత్తమ్మీద, వరుణ్ సందేశ్ – వితిక ఈసారి బిగ్‌బాస్ రియాల్టీ షోకి సంబంధించి హాటెస్ట్ టాపిక్ కాబోతున్నారన్నమాట.
బిగ్‌హౌస్‌లో రాజకీయాలు, ఈ జంటపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి.? ఈ జంట రాజకీయం, మిగతా కంటెస్టెంట్లపై ఎలా వుండబోతోంది.? అన్న ప్రశ్నలకు సమాధానం ముందు ముందు తెలుస్తుంది.