బిగ్ హౌస్‌లో గొడవలు అప్పుడే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ‘ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు..’ అని ఓ పక్క కంటెస్టెంట్స్ అంతా మాట్లాడుకుంటూనే, ఇంకోపక్క సంయమనం (Bigg Boss Telugu 4 Sohel Vs Abijeet) కోల్పోతున్నారు. అయితే, ఇదంతా ‘బిగ్ స్క్రిప్ట్’లో భాగమా.? అన్నది వేరే చర్చ.
సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌తో కలిసిన సోహెల్, అరియానా (Ariana Glory).. వస్తూనే నిప్పు రాజేశారు. దాన్ని టాస్క్‌లా భావించి, కొందరు ఏమాత్రం ‘ప్రోవోక్’ కాకుండా వున్నాగానీ, గొడవ మాత్రం జరిగింది. సోహెల్ (Syed Sohel) వర్సెస్ అబిజీత్ (Abijeet) ఓ మోస్తరు ఫైట్‌లా మారింది పరిస్థితి. అరియానా అయితే గొంతు చించేసుకుంది.
ఈ క్రమంలో ఆమెకు అఖిల్ ‘మానవీయ కోణం’లో అన్నం తినిపిస్తే, ‘టాస్క్‌లో ఫెయిలయ్యాం’ అనే భావన మిగతా కంటెస్టెంట్స్‌కి కలిగింది. ఈ క్రమంలో అఖిల్ – నోయెల్ (Noel Sean)మధ్య అపార్ధాలు తలెత్తాయి. ఇంకోపక్క కరాటే కళ్యాణి మళ్ళీ ఓవరాక్షన్ చేసింది.
అలేఖ్య హారిక (Alekhya Harika), దీన్నంతటినీ ఓ టాస్క్‌లానే గుర్తించి, కాస్త తెలివిగానే వ్యవహరించింది. ఇదిలా వుంటే, గంగవ్వ ఎపిసోడ్ చివర్లో కన్పించి ‘పవర్’ చూపించింది. నిజానికి, ఎపిసోడ్ మొత్తంలో గంగవ్వ సీన్స్ మాత్రమే హైలైట్ అని చెప్పొచ్చేమో. గంగవ్వ పేల్చే ఒక్కో డైలాగ్, మిగతా కంటెస్టెంట్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది.
అయితే, అందరూ హౌస్‌లో గంగవ్వని (Gangavva) చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే, మెహబూబ్ దిల్ సే సరిగ్గా స్క్రీన్‌పై కన్పించడంలేదు. డాన్సులు చేస్తున్నాడు.. హౌస్‌మేట్స్‌తో బాగానే కలుస్నుఆ్న, ఎందుకో స్క్రీన్ స్పేస్ అతనికి దక్కడంలేదు. సూర్యకిరణ్ (Surya Kiran), అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) ‘స్పేస్’ తీసుకుంటున్నారు.
యాజ్ యూజువల్ మోనాల్ గజ్జర్ (Monal Gajjar) హాట్‌గానే కనిపించింది. అయితే, ఈసారి ఆమెకు ఏడుపు సీన్లు లేవు. ఆ ఏడుపు సన్నివేశాల్ని అఖిల్ సార్దక్ (Akhil Sarthak) తీసుకున్నట్టున్నాడు. ‘మనం ఓడిపోకూడదు.. నువ్వు ఎలిమినేట్ కాకూడదనే భావనతోనే చెప్పాను..’ అని నోయెల్ ఎంత వివరణ ఇచ్చుకున్నా, తప్పదు.. ఏడవాల్సిందే అన్నట్లు అఖిల్ కాస్సేపు గట్టిగానే ఏడ్చేశాడు.
లాస్య (Lasya Reddy) పెద్దగా ఇంపాక్ట్ చూపించడంలేదు. దివి కూడా చాలా తక్కువగా కన్పిస్తోంది. అబిజీత్‌కి (Bigg Boss Telugu 4 Sohel Vs Abijeet) స్క్రీన్ స్పేస్ బాగానే దక్కుతోంది. ఓవరాల్‌గా ‘షో’ ఇంకా రక్తి కట్టించేలా మారడంలేదు. టాస్క్‌లు మొదలవుతున్న దరిమిలా, ముందు ముందు ఆ ‘పెప్’ కన్పిస్తుందేమో చూడాలిక.