BiggBossTelugu9 Kalyan Padala Winner.. అసలు కంటెస్టెంట్లు ఎందుకు తిట్టుకుంటారో తెలియదు.!
గుడ్డు కోసం గొడవ, పప్పు కోసం యుద్ధం.! అలా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ వుంటేనే కదా, రేటింగులు పెరిగేది.!
వీకెండ్‌లో హోస్ట్ వస్తాడు, కంటెస్టెంట్లకు క్లాస్ పీకుతాడు. సోమవారం వచ్చిందంటే, నామినేషన్ల మంట.! మధ్యలో ఎంటర్టైన్మెంట్ పేరుతో వెగటు పుట్టించే విషయాలు.
టాస్కుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! ఇవేం చిల్లర టాస్కులు.? అని విసుకకుంటూ బుల్లితెర వీక్షకులు, బిగ్ బాస్‌ని ఎప్పుడో లైట్ తీసుకున్నారు.
పెయిడ్ పీఆర్ మాఫియా, ఆయా కంటెస్టెంట్ల తరఫున సోషల్ మీడియాలో నడిపే ఫ్యాన్ వార్స్ వల్ల, కాస్తో కూస్తో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో వార్తల్లో వుంటోందంతే.
ఎలాగైతేనేం, న్యూసెన్స్ తగ్గింది.! తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో తొమ్మిదో సీజన్ ముగిసింది మరి.! కళ్యాణ్ పడాల, తొమ్మిదో సీజన్ విన్నర్ అయ్యాడు.
అదేంటీ, ఇమ్మాన్యుయేల్ కదా విన్నర్ అవ్వాల్సింది.? సారీ, కమెడియన్లకు ‘విన్నర్’ అయ్యే ఛాన్సే లేదు.
పోనీ, తనూజ అయినా గెలిచి వుండాలి కదా.? ప్చ్, మహిళా కంటెస్టెంట్లకు ‘బిగ్ బాస్ టైటిల్’ ఇవ్వడానికి వీల్లేదు.!
ఇలా, సెటైర్లు పడుతున్నాయ్ సోషల్ మీడియాలో. కళ్యాణ్ కంటే, పవన్‌కి ఏం తక్కువ.? అన్న చర్చ కూడా జరుగుతోంది.
‘సారీ.. ఇదే ఆఖరు.. ఇకపై బిగ్ బాస్ ఎప్పుడూ చూడం..’ అంటూ, కొందరు నెటిజనం సోషల్ మీడియాలో తీర్మానించేసుకున్నారు.
గతంలో, ఎన్ని కోట్ల మంది బిగ్ బాస్ చూశారో, హోస్ట్ నాగార్జున చెప్పడం చూశాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బిగ్గెస్ట్ రియాల్టీ షో.. అన్న భజన మాత్రమే.
ఒకప్పుడు, కంటెస్టెంట్లకు వచ్చిన ఓట్ల గురించిన ప్రస్తావన కూడా వుండేది. ఇప్పుడు అదీ లేదు. బిగ్ బాస్ రివ్యూయర్స్.. అంటూ, సోషల్ మీడియాలో కొందరు హడావిడి చేస్తున్నారు.. పేమెంట్లకు అనుగుణంగా.
పదిహేను లక్షలు తీసుకుని, పవన్ ‘సెల్ఫ్ ఔట్’ అయిపోవడం ఓ డ్రామా.! ఇది కూడా పాత డ్రామానే.! ఇంకాస్త ఎక్కువ ఆశ చూపి, ఇద్దరు కంటెస్టెంట్లలో ఒకర్ని ఔట్ చేయాలన్న ప్రయత్నమూ ఓల్డ్ టెంప్లేటే.!
ఎలా చూసినా, తొమ్మిదో సీజన్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. పోనీ, అంతకు ముందున్న సీజన్‌లో ఏమన్నా కొత్తదనం వుందా.? అంటే, అదీ లేదు.!
వచ్చే ఏడాది పదో సీజన్ వస్తుంది.. ఆ తర్వాత పదకొండో సీజన్.! నాసిరకం.. పరమ నాసిరకం కంటెస్టెంట్లను ఏరికోరి మరీ తెస్తున్నారు బిగ్ బాస్ తెలుగు రియల్టీ కోసం.!
కామన్ మెన్ కాస్త టైటిల్ విన్నర్ అయ్యాడు.. అదొక్కటే, తొమ్మిదో సీజన్‌లో కాస్త ఊరట.!
