BiggBossTelugu9 Ramya Moksha Thanuja.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ తొమ్మిదో సీజన్లో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎవరు.? అంటే, ఆ లిస్టులో ముందుగా వచ్చే పేరు తనూజ.!
కాదు కాదు, తనూజ వల్లనే కదా, భరణి ఎలిమినేట్ అయ్యింది.? అంటూ, ఇంకో వాదన తెరపైకొస్తుంటుంది. ఎవరి గేమ్ వాళ్ళది.!
భరణి ఎలిమినేట్ అవడం, స్వయంకృతాపరాధం కావొచ్చు. లేదా, మ్యాచ్ ఫిక్సింగ్ కూడా అయి వుండొచ్చు. అంటే, ముందే ఎన్ని వారాలు భరణి వుండాలన్నది బిగ్ బాస్ డిసైడ్ చేసెయ్యడం.
భరణి – తనూజ మధ్య ఓ రకమైన బాండింగ్ వుండేది.! అమ్మా.. అని భరణి, తనూజని పిలిచేవాడు. నాన్నా.. అని భరణిని తనూజ పిలిచేది.
ఆ బాండింగ్ చుట్టూ బిగ్ హౌస్‌లోనూ, సోషల్ మీడియాలోనూ నానా యాగీ జరిగిన, జరుగుతున్నమాట వాస్తవం.
నామినేషన్ల సమయంలో ప్రతిసారీ, ఈ బాండింగ్ గురించిన రచ్చే జరుగుతూ వచ్చింది. అది, ఇంకా కొనసాగుతూనే వుంది.
BiggBossTelugu9 Ramya Moksha Thanuja.. నేను దేవతనే.. వచ్చి దర్శనం చేసుకో..
తాజాగా, తనూజని ఓ కంటెస్టెంట్ బిగ్ హౌస్‌లో ‘దేవత’గా మార్చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పచ్చళ్ళ పాప అలియాస్ రమ్య మోక్ష.. చెప్పిన ఉద్దేశ్యం వేరు, దాన్ని తనకు అనుకూలంగా తనూజ మార్చుకున్న విధానం వేరు.!
తనూజని నామినేట్ చేస్తూ రమ్య, బోల్డంత హడావిడి చేసింది.. గట్టిగా అరిచేసింది. ఈ క్రమంలో తనూజ కూడా గట్టిగానే సమాధానమిచ్చింది.
Also Read: అదృష్ట దేవత: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
వెటకారం టోన్‌లో తనూజని దేవతగా రమ్య అభివర్ణిస్తే, ఔను దేవతనే.. వచ్చి దర్శనం చేసుకో.. అంటూ, ‘దేవతలా’ భంగిమ కూడా ఇచ్చేసింది తనూజ.
ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’ అనే డైలాగ్‌ని ఆ వీడియోకి జత చేసి, తనూజ సపోర్టర్స్ తిప్పుతున్నారు.
ఏదో చేద్దామని రమ్య అనుకుంటే, అది కాస్తా తనూజకి అడ్వాంటేజ్ అయి కూర్చుంది.! ఈ సీజన్లో తనూజకి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయంతే.
