BiggBossTelugu9 Rithu Chowdary.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్ మొదటి వీకెండ్.. షరామామూలుగానే, హోస్ట్ నాగార్జున పీకిన క్లాసులు హాట్ టాపిక్ అయ్యాయి.
హోస్ట్ అన్నాక, కంటెస్టెంట్లకు క్లాసులు పీకాలి.. వారిని ఆడించాలి. అక్కినేని నాగార్జున చేసేది అదే. కంటెస్టెంట్లు ఏడవాలి.. నవ్వాలి.. గంతులేయాలి.. ఇది వారి టాస్క్.!
సంజన ఏడ్చింది.. తనూజ కూడా ఏడ్చింది.. చివరికి ఇమ్మాన్యుయేల్ కూడా ఏడ్చేశాడు. ఫ్లోరా సైనీ సంగతి సరే సరి. ఎవ్వరూ తగ్గలేదు.! ఒకర్ని మించి ఇంకొకరు చెలరేగిపోయారు.
BiggBossTelugu9 Rithu Chowdary.. ఇంతకీ, రితూ చౌదరి అత్యుత్సాహం దేనికి.?
అక్కడ సీరియస్‌గా హరిత హరీష్‌కి క్లాస్ తీసుకుంటున్నాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ఒకేటమో, ‘రెడ్ ఫ్లవర్’కి సంబంధించినది. ఇంకోటి, ‘అమ్మాయిలతో పోటీ’ అన్నదానిపైన.
అబ్బాయిలు, అమ్మాయిలు.. జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా వుండే బిగ్ బాస్ హౌస్‌లో, అబ్బాయిల్ని అమ్మాయిలతో పోల్చడమైనా, అమ్మాయిల్ని అబ్బాయిలతో పోల్చడమైనా.. తప్పే.
ఆ తప్పే, హరిత హరీష్ చేశాడు. దాంతో, పేరులోని హరితని తీసేస్తానన్నాడు హోస్ట్ నాగార్జున. తీయొద్దంటూ తెగేసి చెప్పాడు హరీష్.
Also Read: Anushka Shetty Ghaati Review: గంజాయి స్మగ్లింగ్.. రివెంజ్ డ్రామా.!
ఈ వ్యవహారంలోకి అనవసరంగా దూరింది రీతూ చౌదరి. హౌస్ మొత్తం హరీష్ చేసింది తప్పని తేల్చితే, తప్పు కాదని హరీష్‌ని వెనకేసుకొచ్చింది రీతూ.
ఆడియన్స్ కూడా హరీష్‌ని తప్పు పడుతుంటే, రీతూ ఎందుకు హరీష్‌ని వెనకేసుకొచ్చినట్లు.? బహుశా, నామినేషన్స్‌లోకి వెళితే, హరీష్ ఫ్యాన్స్ తనకి ఓట్లేస్తారని రీతూ అనుకుందేమో.
బిగ్ బాస్ అంటేనే.. గిమ్మిక్కు.! తిమ్మిని బమ్మిని చేసే ఓ మ్యాజిక్కు.! అక్కడ జరిగేదంతా ఓ నాటకం.! పేరుకే రియాల్టీ.. అందులో అసలంటూ రియాల్టీనే వుండదు.
నాటకం కాకపోతే, ‘నిన్ను నువ్వు మార్చుకో’ అని హోస్ట్ నాగార్జున, హరీష్‌కి సూచించడమేంటి.? నిర్మొహమాటంగా హౌస్ నుంచి బయటకు పంపేయాలి కదా.?
హరీష్ సంగతెలా వున్నా, హరీష్‌కి సపోర్ట్ ఇచ్చి.. రితూ చౌదరి ‘బకరా’ అయిపోయిందిక్కడ. ఒక్కసారిగా, క్రెడిబులిటీ కోల్పోయింది.
గత సీజన్‌లో విష్ణు ప్రియ కూడా ఇలానే అనవసర విషయాల్లో తలదూర్చేది.