BiggBossTelugu9 Same Old Drama.. బిగ్ బాస్ హౌస్.. అంటే, అదో సర్కస్.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కంటెస్టెంట్లను బఫూన్లుగా మార్చేస్తాడు బిగ్ బాస్.
అక్కడేం జరుగుతుందో అందరికీ తెలుసు.. తెలిసీ, కంటెస్టెంట్లుగా వెళతారంటే, బిగ్ బాస్ ద్వారా వచ్చే పాపులారిటీ అలాంటిది మరి.
బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లందరికీ స్టార్‌డమ్ వస్తుందా.? అంటే, ప్చ్.. కష్టమే. కానీ, కొందరికి పాపులారిటీ వస్తుంది. ఇంకొందరికి పాపులారిటీ పోతుంది.
BiggBossTelugu9 Same Old Drama.. ఇదేం టాస్క్ మహానుభావా.?
ఓ టాస్క్ తాజాగా జరిగింది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్‌లో. మొహానికి, ఓ మాస్క్ లాంటిది పెట్టుకుంటారు.. దానికి, ముళ్ళ లాంటి ఏర్పాట్లుంటాయ్.
ఓ బాక్స్‌లో, కింద కన్నం పెట్టారు.. అందులోంచి, తలకాయ్ పైకి పెట్టాలి. ఆ పైన, బెలూన్లు వేస్తుంటారు. కంటెస్టెంట్ల మధ్య నడిచిన టాస్క్ ఇది.
బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు.. కంటెస్టెంట్లు ఎవరికి అర్థమయినట్లు వాళ్ళు ఆడేశారు. సంచాలకుడూ, కెప్టెన్.. ఇద్దరూ చేష్టలుడిగి చూశారు.

అంతిమంగా, టాస్క్ ముగిసింది.. ఎవరూ రూల్స్ ఫాలో అవలేదని ఆరోపిస్తూ, బిగ్ బాస్.. ఆ టాస్క్‌ని రద్దు చేసేశాడు. వున్నంతలో, సంజన, ఫ్లోరా మాత్రమే పద్ధతిగా ఆడారట.
సరిగ్గా ఆడి, ఓడిపోయాం.. అంటూ సంజన తెగ ఏడ్చేసింది.. కాదు కాదు, ఏడ్చినట్లు బాగా నటించిందంతే. ప్రతిసారీ బిగ్ బాస్‌లో ఇలాంటి చెత్త టాస్క్‌లు నడుస్తూనే వుంటాయ్.
వాటిల్లోంచి ప్రతిసారీ, ఓ టాస్క్‌ని ఇలా బిగ్ బాస రద్దు చేస్తుంటాడు. ఒక్కోసారి ఒకటికి మంచి టాస్క్‌లు రద్దవుతుంటాయి. ఇదో మ్యాజిక్కు.
అక్కడ తప్పులు జరుగుతున్నప్పుడే, బిగ్ బాస్.. వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి కదా.? బిగ్ బాస్ ఏమైనా తింగరోడా.? మూర్ఖుడా.? అని జనాలతో తిట్టించుకోవడమెందుకు.?
Also Read: తొలగిస్తే, ‘బంధం’ తెగిపోయినట్లే..నా!?
ఈ మొత్తం వ్యవహారంలో ఈజీ టార్గెట్ అయిపోయింది రీతూ చౌదరి. అదేంటో, హౌస్‌లో అన్ని అనర్థాలకీ రీతూ రౌదరినే కారణమన్నట్లుగా ట్రోలింగ్ నడుస్తోంది సోషల్ మీడియాలో.
రీతూ చౌదరి మాత్రం ఏం చేయగలుగుతుంది.? అయినా, హౌస్‌లో మిగతావాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు.? అంతా, బిగ్ బాస్ డైరెక్షనే కాదు.
డైరెక్షన్ సరిగ్గా లేనప్పుడు, అందులో నటీనటులు మాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయడానికి ఏముంటుంది.?
