Home » అమరావతిలో బిల్ గేట్స్.! ఆకాశం నుంచి అదః పాతాళం దాకా.!

అమరావతిలో బిల్ గేట్స్.! ఆకాశం నుంచి అదః పాతాళం దాకా.!

by hellomudra
0 comments
Bill Gates

Bill Gates Andhra Pradesh.. బిల్ గేట్స్.. గురించి కొత్తగా పరిచయం చేయాలా.? ప్చ్, అవసరమే లేదు.! ఎందుకంటే, కంప్యూటర్ యుగానికి ఆయన రారాజు.!

ఒకప్పుడు.. రారాజు.! మరి, ఇప్పుడో.? ఎప్‌ స్టీన్ ఫైల్స్ కారణంగా, బిల్ గేట్స్ పేరు అదః పాతాళానికి పడిపోయింది.! చిన్నారులతో లైంగిక సంబందాలంటూ బిల్ గేట్స్ మీద ఆరోపణలొస్తున్నాయ్.

నిజానికి, ఎప్ స్టీన్ అనే వ్యక్తి చిన్నారులతో లైంగిక సంబంధాలు నడపడం.. ఆ ఎప్ స్టీన్‌తో బిల్ గేట్స్ సంబంధాలు.. వెరసి, ఈ వివాదానికి కారణం.

ప్రస్తుతానికి బిల్ గేట్స్ మీద వున్నవన్నీ ఆరోపణలు మాత్రమే. కానీ, ప్రపంచ వ్యాప్తంగా బిల్ గేట్స్.. ఎదుర్కొంటున్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు.

Bill Gates Andhra Pradesh.. భారత దేశంలో బిల్ గేట్స్ పర్యటన..

సరిగ్గా ఈ తరుణంలోనే బిల్ గేట్స్, భారత దేశానికి వచ్చారు. అందునా, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బిల్ గేట్స్‌కి ఘనంగా ఆహ్వానం పలికారు.

రాజధాని అమరావతి నిర్మాణం సహా, అనేక అంశాలకు సంబంధించి బిల్ గేట్స్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు.

Also Read: చక్కనమ్మ చెవులకెందుకింత ‘బరువు’ బాధ్యతలు.?

బిల్ గేట్స్ అంటే, ఒకప్పటి మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, గేట్స్ ఫౌండేషన్ ద్వారా వేల కోట్లు, లక్షల కోట్ల నిథుల్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న మానవతావాది.

ఆరోపణల సంగతి పక్కన పెడితే, ఇప్పటికీ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో చాలా దేశాల్లో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

సో, బిల్ గేట్స్ విషయంలో దూషణలు సబబు కాదు.! చట్టం ముందర బిల్ గేట్స్ దోషి.. అని నిరూపితమయినప్పుడు.. అప్పుడెలాగూ, ప్రపంచం అతన్ని ఏకిపారేస్తుంది. అది వేరే చర్చ.

లేదూ, బిల్ గేట్స్‌కీ ఆ వివాదానికీ సంబంధం లేదని న్యాయస్థానాలు తేల్చితే, ఈ దూషణల్లో అర్థముండదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group