Table of Contents
Andhra Pradesh.. కారు ఫిట్‌నెస్ సరిగ్గా లేదన్న కారణంగా, నడి రోడ్డు మీద అందులో ప్రయాణిస్తున్నవారిని కిందికి దించేశారట.!
ఆ కారుని మాత్రం ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం వాడుకునేందుకుగాను రెండు వేల రూపాయల్ని కారు డ్రైవర్‌కి ఇచ్చారట అధికారులు.!
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన తయారైంది వ్యవహారం.! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రైవేటు వాహనంలో బయల్దేరడమే ఆ కుటుంబం చేసిన తప్పు.!
ఔను, అది ముమ్మాటికీ తప్పే.! లేకపోతే, ఈ దారి దోపిడీ ఏంటి.? పైగా, దానికి ‘కవర్ డ్రైవ్’ ఏంటి.? ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం వాహనాలు ప్రజల నుంచి సేకరిస్తారా.? ఇదెక్కడి వింత.?
Andhra Pradesh.. నిఖార్సయిన దారి దోపిడీ ఇది
ఇది ఎవరి కండ కావరం.? ప్రభుత్వాల్ని నడుపుతున్న రాజకీయ నాయకులదా.? ఆ ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులదా.? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
‘ఇప్పటికైతే కారుని దొంగిలించారు.. రేప్పొద్దున్న అమ్మాయి అవసరమైతే, ఇళ్ళల్లోంచి లాక్కెళ్ళిపోతారా.?’ అని ప్రతిపక్ష నేత సంధించిన ప్రశ్నలో అర్థం వుంది.
ఈ ఘటనకు కారకులైన కింది స్థాయి సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది. కానీ, వేటు పడాల్సింది ఉన్నతాధికారుల మీద.
ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం వాహనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ప్రభుత్వం వుందంటే, అంతకన్నా సిగ్గుచేటైన వ్యవహారం ఇంకేముంటుంది.?
ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ప్రజల్ని రోడ్డున పడేస్తారా.?
వెంకటేశ్వరస్వామికి భక్తులు ‘నిలువు దోపిడీ’ పేరుతో కానుకలు సమర్పించుకోవడం మామూలే. కానీ, ఇదేం దోపిడీ.? పైగా, దారి దోపిడీ.. అందునా, ప్రభుత్వ సిబ్బంది చేసిన దోపిడీ. ఇది అస్సలు క్షమార్హం కాదు.
ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం పోయేది ఇలాంటి సందర్భాల్లోనే.! ఏదో చిన్న ఘటన.. అని ప్రభుత్వం లైట్ తీసుకుంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటుండదు.
బాధ్యత ఎవరిది.? శిక్ష ఎవరికి.?
ప్రభుత్వాన్ని నడిపే ‘పెద్దల’ నుంచి, అధికారుల వరకూ.. అందరూ బాధ్యత వహించి తీరాల్సిందే.
ప్రభుత్వమంటే ప్రజల్ని పరిపాలించడానికి.. ప్రజల్ని పీడించడానికి కాదు. అధికారులు పని చేయాల్సింది ప్రజల కోసం.. ప్రజల్ని దోచుకోవడానికి కానే కాదు.
ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న బాధ్యతనెరిగి పాలకులు పని చేయాలి తప్ప, తమ ఆర్భాటాల కోసం ప్రజల్ని నడి రోడ్డు మీద పడేయకూడదు.
Also Read: సాయం చేసేవాడు దేవుడైతే.. నువ్వే ఆ దేవుడివి పవన్ కళ్యాణ్.!
ఒక్కమాటలో చెప్పాలంటే అధికారమంటే సేవ.. ఆ అధికారం కండకావరం ప్రదర్శించం కోసం ఉద్దేశించింది కానే కాదు.!
చివరగా.. ఆపద మొక్కులవాడు.. అనాధ రక్షకుడు.. వడ్డీ కాసులవాడు.. ఆ శ్రీ వెంకటేశ్వరుడే అధికారం మాటున చెలరేగిపోతున్న ‘మారీచుల్ని’ శిక్షించాలి. ఎందుకంటే, ఇక్కడ కష్టం కలిగింది ఆ వెంకటేశ్వరుడి భక్తులకే మరి.!