Bindu Madhavi Bigg Boss Non Stop.. బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే, అదో ‘లౌడ్ అండ్ వైల్డ్’ వ్యవహారం. గట్టిగా అరిచేవారు.. దాన్ని శాంతంగా భరించేవారు.. ఇలా హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్స్ వుంటారు.
ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళది. హౌస్‌లో అరిచారని, నిజ జీవితంలో వాళ్ళలాగే వుంటారనుకుంటే అది పొరపాటే.
ఏ సమయానికి ఏ గేమ్ ప్లాన్ అమలు చేయాలో, అది అమలు చేస్తేనే, ఆటలో ముందడుగు వేయడానికి వీలవుతుంది.
సరే, బిగ్ బాస్ (Bigg Boss Telugu) రియాల్టీ షో అంతా స్క్రిప్టెడ్ అనీ, ఓ డైరెక్టర్ మొత్తం కథంతా నడిపిస్తాడనే విమర్శలు కొత్తవేమీ కావు.
నిజంగానే అక్కడ అలా జరుగుతుందా.? అంటే, దానిపై మళ్ళీ చాలానే భిన్నాభిప్రాయాలున్నాయి.
Bindu Madhavi Bigg Boss Non Stop శివంగి ఇక్కడ.!
అసలు విషయానికొస్తే, సినీ నటి బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Telugu OTT) వెర్షన్‌లో శివంగిలా చెలరేగిపోతోంది.
క్యూట్ అండ్ లవ్లీగా కనిపిస్తుందిగానీ, లోపల చాలా వైల్డ్ ఆలోచనలుంటాయి బిందు మాధవికి.

హౌస్‌లో చాలా యాక్టివ్ కంటెస్టెంట్.. అదే సమయంలో, పక్క గేమ్ ప్లాన్‌తో వ్యవహరిస్తుంటుంది. ఎవరన్నా తనను టార్గెట్ చేస్తే, అంతకు మించిన డోస్ వాళ్ళకు ఇచ్చి పడేస్తుంటుంది ఈ తెలుగమ్మాయ్.
బిగ్ బాస్ అయిపోయాక, చెన్నయ్ చెక్కేస్తుంది.. నేను పక్కా లోకల్.. అని ఓ కంటెస్టెంట్ సెటైరేస్తే, ఆ కంటెస్టెంట్‌కి ఆయన స్టైల్లోనే రిటార్ట్ ఇచ్చి పడేసేంత కేపబిలిటీ వున్న శివంగి బిందు మాధవి.
బిందు మాధవి తెచ్చిన హైప్ ఇదంతా.!
ఒక్కోసారి బిందు మాధవి (Bindu Madhavi) చేసే ఆ మిమిక్రీ కావొచ్చు, అవతలి వ్యక్తుల్లా నటించి చూపించడం కావొచ్చు.. కొంతమందికి చికాకు కలిగించడంలో వింతేమీ లేదు.
కానీ, అంతకు ముందు జరిగిన సీన్ చూస్తేనే, బిందు మాధవి అలా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థమవుతుంది.
Also Read: కాఫీ విత్ కరణ్.! ఈ ‘కంత్రీ’ వేషాలేంటి సామీ.?
నిజానికి, బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) విషయంలో తొలుత ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఇదొక ఫ్లాప్ షో అనుకున్నారంతా.
ఇప్పుడు కేవలం బిందు మాధవి కోసమే బిగ్ బాస్ నాన్ స్టాప్.. అనేంతలా ఆ షోకి ఆమె వల్ల పాపులారిటీ వచ్చిపడింది.