Soniya Akula Bigg Boss.. అరరె.. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ నుంచి ఔట్ అయిపోయిందే.! అసలిలా ఎలా జరుగుతుందబ్బా.?
ప్చ్.. ఏదో అలా జరిగిపోయిందంతే.! స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్‌లో టాప్ పొజిషన్‌లో వుంటుందనుకున్న సోనియా ఆకుల, అనూహ్యంగా కిందికి పడిపోయింది.!
సోషల్ మీడియాలో సోనియా ఆకుల తరఫున చాలా బాగా పీఆర్ టీమ్స్ పని చేశాయ్. కొన్ని అభిమాన సంఘాలూ ఏర్పడ్డాయ్.
కానీ, బిగ్ బాస్ లెక్కలు వేరే వుంటాయ్. అసలెవరు ఓట్లు వేశారో, ఎవరికి వేశారో.. ఆ లెక్కలు మాత్రం బయటకు చెప్పారు. ఈ లెక్కల బాగోతం వేరే లెవల్ అంతే.
మణికంఠ – సోనియా మధ్య ఫైనల్ ఫైట్‌లో సోనియా ఔట్ అయిపోవడమే ఆశ్చర్యకరం. పైగా, టీమ్ మేట్స్ అభిప్రాయం కూడా సోనియా ఆకుల ఔట్ అయిపోవాలనే.!
Soniya Akula Bigg Boss,, వర్మ దెబ్బ కొట్టేశాడు.!
ఇదిలా వుంటే, వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో సోనియా ఆకుల గతంలో నటించింది.
ఆ పరిచయంతోనే, రామ్ గోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగి, సోనియా ఆకులకు ఓటెయ్యాలంటూ ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు పిలుపునిచ్చాడు.
కాకపోతే, రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనని సైతం ఎవరూ లెక్క చేయలేదు. వర్మ అభిమానులూ సోనియా ఆకులకి ఓటేసినట్లు లేరు.
అన్నట్టు, వర్మ అంటే ఒకప్పుడు వైసీపీకి పెద్ద పేటీఎం కార్యకర్త కదా.! పోనీ, ఆ వైసీపీ మద్దతుదారులైనా సోనియా ఆకులకు అండగా ఓటేశారా.? అంటే, అదీ లేదాయె.!
Also Read: రామ్ చరణ్ ‘బీస్ట్’ మోడ్.!
వర్మ చెప్పాడని వైసీపీకే ఓటెయ్యలేదు వైసీపీ మద్దతుదారులు.. సోనియా ఆకులకి ఎలా ఓటేస్తారు.. నాన్సెన్స్ కాకపోతే.!
ఇంకో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే, వర్మ ట్విట్టర్ టైమ్‌లైన్‌లో సోనియా ఆకుల కోసం వేసిన ట్వీట్, ఆమెకు మైనస్‌గా మారిందట.!
అంటే, సోనియా ఆకుల ఔట్ అయిపోవడానికి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వర్మ కూడా కారణమయ్యాడని అనుకోవాలేమో.!
ఇవేవీ కాదు, హౌస్‌లో తన ఆట మర్చిపోయి, కేవలం నిఖిల్ – పృధ్వీలతో సోనియా ఆకుల టైమ్ పాస్ చేయడం, ఇతర కంటెస్టెంట్ల దృష్టిలో పలచనైపోవడం, ఆమె ఓటమికి కారణమని చెప్పొచ్చు.
అంతే మరి, ఓటింగ్ ప్యాటర్న్‌లో ఇతర కంటెస్టెంట్ల అభిమానులు, తమ అభిమాన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ రేసులో లేనప్పుడు వేసే ఓట్లు కూడా కీలకంగా మారుతుంటాయ్ మరి.!