Table of Contents
Bindu Madhavi.. బిందుమాధవి.. బిగ్ బాస్ నాన్ స్టాప్ పుణ్యమా అని సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న పేరు ఇది. పదహారణాల తెలుగమ్మాయ్ ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్‌గా తెలుగు తెరపై వెలిగిపోవాలనుకుని కోటి ఆశలతో తెరంగేట్రం చేసింది. కానీ, పొరుగింటి పుల్లకూరలంటే రుచి ఎక్కువ అయిన టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బిందు మాధవి నిలదొక్కుకోలేకపోయింది.
తొలి సినిమా ‘ఆవకాయ్ బిర్యానీ’తో హీరోయిన్‌గా ఓ మోస్తరు పేరు దక్కించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ సరసన ‘బంపర్ ఆఫర్’ సినిమాలో నటించి హిట్టు కొట్టింది.
తొలి సినిమాలో గ్లామర్‌కి సంబంధించి, కాస్త హద్దుల్లో వున్న బిందు మాధవి, ముంబయ్ భామలకు తానేం తీసిపోనని నిరూపించింది రెండో సినిమాతో. అయినా కానీ, అంతంత మాత్రం ఆఫర్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ముగ్గురూ ముగ్గురే.. తేడా ఎక్కడ కొట్టిందబ్బా.!
బిందు మాధవిని తొలిసారి ఇండస్ర్టీకి పరిచయం చేసిన క్రెడిట్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములది.
ఓ యాడ్ షూట్‌లో బిందు మాధవిని చూసిన శేఖర్ కమ్ముల, ఆయన నిర్మాణంలో రూపొందిన ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్సిచ్చారు.
ఆ తర్వాత వచ్చిన ‘బంపర్ ఆఫర్’ మూవీకి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే, ముచ్చటగా మూడో సినిమా అయిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాని దిల్ రాజు నిర్మించారు.

ముగ్గురూ ముగ్గురే. ఇండస్ట్రీకి సంబంధించి టాప్ పొజిషన్లలో వున్నవాళ్లే.
అయినా బిందు మాధవికి సెకండ్ ఛాన్స్ దక్కలేదు. తేడా ఎక్కడ కొట్టిందబ్బా.! అంటే ఎంత టాలెంట్ వున్నా, బిందు మాధవి తెలుగమ్మాయ్ కావడమే ఆమె దురదృష్టం అనుకోవాలేమో.
Bindu Madhavi.. తమిళనాట దక్కిన స్టార్‌డమ్..
అదేంటో తెలుగమ్మాయిలకు తమిళ తంబీలు పట్టం కట్టడం ఎప్పటి నుంచో చూస్తూనే వున్నాం. అలాగే బిందు మాధవి కూడా తమిళంలో స్టార్‌డమ్ దక్కించుకుంది.
తొలి సినిమాతోనే తమిళ తంబీలకు బిందు మాధవి తెగ నచ్చేసింది. దాంతో డజన్ల కొద్దీ ఆఫర్లతో తమిళ నాట బిందు మాధవి బిజీ అయిపోయింది.
అక్కడ అలా.. ఇక్కడ ఎలా.?
హీరోయిన్‌గా బిజీగా వున్న టైమ్‌లోనే తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంపికైంది బిందుమాధవి. దాదాపు టైటిల్ విన్నర్ అనుకున్న టైమ్‌లో తెర వెనుక జరిగిన అన్యాయానికి బలైపోయింది.
టాప్ 5 లో బిందు మాధవి ఎలిమినేట్ అయ్యింది. అప్పట్లో ఈ ఇష్యూ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారి తీసింది కూడా.
ఇక, ఇప్పుడు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారమవుతున్న తెలుగు బిగ్‌బాస్‌లో బిందు మాధవి కంటెస్టెంట్ అన్న సంగతి తెలిసిందే. చాలా తెలివిగా, జన్యూన్‌గా గేమ్ ఆడుతోంది బిందు మాధవి.
తన ఆటిట్యూడ్, క్లవర్‌నెస్‌తో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షించింది బిందు మాధవి. అందుకే, సోషల్ మీడియా వేదికగా బిందు మాధవిని తెగ సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు నెటిజనం.
బిగ్‌బాస్ విన్నర్ Bindu Madhavi.. ఆ లోటు తీరిపోనుందేమో
దాంతో నెట్టింట ట్రెండింగ్ అయిపోయింది బిందు మాధవి. అంతేకాదు, తెలుగు బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ బిందు మాధవి.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: ప్రగ్యా జైస్వాల్ లిక్కర్ ‘కిక్కు’.! లేదా ప్రశ్నించే హక్కు.?
లేడీ కోటాలో బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకున్నది లేదింతవరకూ. కనీ వినీ ఎరుగని రీతిలో బిందు మాధవికి వస్తున్న క్రేజ్ చూస్తుంటే, ఈ సారి బిగ్‌బాస్ టైటిల్ బిందు మాధవినే వరించనుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.!