Table of Contents
Bison Dhruv Tollywood Caste.. ‘చియాన్’ విక్రమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమేముంది.? విలక్షణ నటుడు విక్రమ్.!
అభిమానులు విక్రమ్‌ని ముద్దుగా ‘చియాన్’ అని పిలుచుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే.
విక్రమ్ సినిమాకి తమిళంలో ఎంత క్రేజ్ వుంటుందో, ఆ స్థాయి క్రేజ్ తెలుగులోనూ కనిపిస్తుంటుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లోకి విక్రమ్ సినిమాలు డబ్ అవుతాయి.
రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు విక్రమ్.! కమర్షియల్ సినిమాల కంటే, ప్రయోగాత్మక సినిమాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంటాడీ విలక్షణ నటుడు.
అందుకే, విక్రమ్ నుంచి ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన సినిమాలొస్తాయి. విక్రమ్ సినిమాలు అడపా దడపా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వొచ్చు.. కానీ, నటుడిగా విక్రమ్ ఏనాడూ ఫెయిల్ అయ్యింది లేదు.
Bison Dhruv Tollywood Caste.. తండ్రికి తగ్గ తనయుడు..
మరి, అలాంటి విక్రమ్ తనయుడు ధృవ్ కూడా సినీ రంగంలో ప్రయోగాలు చెయ్యకపోతే ఎలా.? చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే అతన్నుంచి ‘బైసన్’ సినిమా వచ్చింది.
తమిళంలో ఆల్రెడీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ‘బైసన్’. వారం రోజులు ఆలస్యంగా తెలుగులోకి వస్తోంది ‘బైసన్’.
మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ధృవ్ సరసన అనుపమ పరమేశ్వరన్ ఈ ‘బైసన్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. కబడ్డీ నేపథ్యంలో ‘బైసన్’ సినిమా తెరకెక్కింది.
సినిమాని తెలుగులో ప్రమోట్ చేయడానికి ‘బైసన్’ టీమ్, హైద్రాబాద్ వచ్చింది. అనుపమ, సినిమా ముచ్చట్లను తెలుగులోనే చక్కగా చెప్పింది. ఆమెకు తెలుగు బాగా వచ్చు.
తెలుగులో గలగలా మాట్లాడేశాడు..
మరోపక్క, ధృవ్ కూడా తెలుగులోనే మాట్లాడేశాడు చాలావరకు. కాకపోతే, స్క్రిప్ట్ ప్రిపేర్ చేయించుకుని చదివేశాడు. అయినాగానీ, చదివినట్లు లేదు.. చక్కగా చెప్పినట్లుంది.
నాన్న విక్రమ్లానే, తానూ కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడానికే ఇష్టపడతానని ధృవ్ అన్నాడు. ‘బైసన్’ కోసం కబడ్డీని సిన్సియర్‌గా నేర్చుకున్నట్లు చెప్పాడు ధృవ్.
మరోపక్క, తమిళంలో ‘కులం ఆధారిత సినిమాలు’ ఎక్కువగా వస్తాయ్.. ఎందుకు.? అంటూ, ఓ ప్రశ్న వస్తే, దానికి ధృవ్ తనదైన శైలిలో స్పష్టమైన సమాధానమిచ్చాడు.
దర్శకుడు మారి సెల్వరాజ్ తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో, అతని క్రియేటివిటీ నుంచి పుట్టిన కథ ‘బైసన్’ అని చెప్పాడు ధృవ్.
సినిమా శక్తివంతమైన మాధ్యమం..
సినిమా శక్తివంతమైన మాధ్యమం అనీ, అలాంటి సినిమా ద్వారా సామాజిక అంశాల్ని స్పృశించడం అనేది మంచి పని అని ధృవ్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.
నిజానికి, ఇలాంటి సున్నితమైన అంశాలపై ప్రశ్నలకు ఎవరైనా ‘స్కిప్’ అనే ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ, ధృవ్ ధైర్యంగా మాట్లాడాడు.
Also Read: పవన్ కళ్యాణ్‌కి ‘తమిళ షాక్’.! ఇది తెగులు పైత్యం.!
తెలుగులో, కన్నడలో హిందూ దేవుళ్ళకు సంబంధించిన అంశాలతో సినిమాలు తీస్తున్నారంటూ, తమిళ సినిమా నుంచి కొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఈ క్రమంలో, తమిళ సినిమాల్లో ఎక్కువగా కుల ప్రస్తావన వుంటుందనే కౌంటర్ ఎటాక్ తెలుగు, కన్నడ సినిమాల నుంచి సోషల్ మీడియా వేదికగా వస్తోంది.
సరిగ్గా, దీన్నే బేస్ చేసుకుని తన ముందుకు ఓ ప్రశ్న వస్తే, అత్యంత స్పష్టతతో ధృవ్ ఇచ్చిన సమాధానం, ‘తండ్రికి తగ్గ తనయుడే’ అని ఆయనకు ప్రశంసల్ని తెచ్చిపెట్టింది.
