Blockbuster HHVM Pawan Kalyan.. ‘హరి హర వీర మల్లు’ సినిమా ‘బ్యాటిల్ ఫర్ ధర్మ’ అంటూ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
‘ధర్మం కోసం యుద్ధం’ ఎలా సినిమాలో, ‘హరి హర వీర మల్లు’గా పవన్ కళ్యాణ్ తెరపై చేశాడన్నది వేరే చర్చ.
సినిమా రిజల్ట్ ఏంటి.? పవన్ కళ్యాణ్ నటుడిగా ఎలా చేశారు.? సాంకేతిక నిపుణుల పనితీరు, నిర్మాణపు విలువలు.. ఇవన్నీ, ఇంకోసారి రివ్యూలో చర్చించుకుందాం.
కానీ, సినిమా రిలీజ్‌కి ముందు ‘వీర మల్లు’ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ప్రధానంగా థియేటర్ల విషయంలో, ‘వీరమల్లు’కి ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్నీ కావు.
Blockbuster HHVM Pawan Kalyan.. ప్రీమియర్స్.. అదరహో..
ఆంధ్ర ప్రదేశ్‌లో ‘హరి హర వీర మల్లు’ సినిమాకి పెద్దగా థియేటర్ల సమస్య ఎదురు కాలేదు. కానీ, తెలంగాణలో పరిస్థితులు వేరేలా వున్నాయి.
నైజాం ఏరియాగా సినీ పరిభాషలో పిలబడే తెలంగాణలో, థియేటర్ల సమస్య చాలా చాలా ఇబ్బంది పెట్టింది.
ప్రభుత్వం తరఫున ప్రీమియర్ షోలకీ అనుమతులు, టిక్కెట్ల ధరల పెంపుకు సానుకూలత లభించినా, థియేటర్లు దొరక్కుండా చేశాయి తెరవెనుక కొన్ని సినీ గద్దలు.

చివరి నిమిషం వరకూ, ప్రీమియర్స్ ఎక్కడ పడతాయో తెలియని పరిస్థితి. రెగ్యులర్ షోస్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దాంతో, అభిమానులు ఆందోళన చెందారు.
కానీ, నిన్న మధ్యాహ్నం నుంచి సీన్ మారింది.. సాయంత్రానికి ‘వీర మల్లు’ ప్రభంజనం మొదలైంది. కుప్పలు తెప్పలుగా ప్రీమియర్స్ కోసం థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి.
వచ్చింది వచ్చినట్లే ఫుల్ అవుతూ పోతేంటే, ‘వీర మల్లు’ సంబరాలకు ఆకాశమే హద్దుగా మారింది. ప్రీమియర్స్‌తోనే రికార్డు స్థాయి వసూళళ్ళను ‘వీర మల్లు’ రాబట్టడం మామూలు విషయం కాదు.
నెగెటివిటీ షురూ..
ప్రీమియర్స్ పడ్డాయ్.. బ్లాక్ బస్టర్ టాక్ బయటకు వచ్చింది. అంతలోనే, ‘మాఫియా’ వికృత రూపం దాల్చింది. రాత్రంతా ‘హేటర్స్’ డ్యూటీ చేశారు.
‘వీర మల్లు’ని తొక్కెయ్యడానికి ఎన్నడూ లేని విధంగా, అర్థరాత్రి నెగెటివ్ రివ్యూలు పెట్టేశాయి చాలా వెబ్‌సైట్లు. అయినాగానీ, ‘వీర మల్లు’ జోరు ఆగుతుందా.? ఛాన్సే లేదు.
Also Read: వార్త – వాత: జనసేన బలోపేతంపై జనసేనాని స్పెషల్ ఫోకస్.!
ప్రభంజనం.. వీర మల్లు ప్రభంజనం.. ఎక్కడ విన్నా ఇదే మాట.! ‘వీర మల్లు’కే ఇలా వుంటే, ‘ఓజీ’ హంగామా ఇంకెలా వుంటుందో.!
రివ్యూ కోసం కాస్త తీరిక చేసుకుందాం. అన్ని విషయాల్నీ డీటెయిల్డ్‌గా ముచ్చటించుకుందాం. ఎందుకంటే, ‘వీర మల్లు’ చేసింది ధర్మం కోసం యుద్ధం.!