Body Builder Justin Vicky.. బరువు ఎత్తకపోతే సచ్చిపోరు.! బరువు ఎత్తితేనే సచ్చిపోతారేమో.! ఇదిగో, ఇక్కడో ప్రబుద్ధుడు బరువు ఎత్తే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.!
సాహస కృత్యాలు చేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది.! ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యవహారాల్ని ఎవరైనా ఎందుకు చేయాలి.?
ఆట కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. ప్రాణం తర్వాతే కదా ఏదైనా.! ఆ ప్రాణాల్ని పణంగా పెట్టి ఏదైనా ఎందుకు చేస్తారు.. ఎవరైనా.?
Body Builder Justin Vicky.. సాహసాలు చేయొచ్చుగానీ..
సాహసం చేయరా డింభకా.! అలాగే అతి సర్వత్ర వర్జయేత్.! ఈ రెండిటినీ పరిగణనలోకి తీసుకోవాలి.!
ఓ బాడీ బిల్డర్ తన శరీరాకృతిని జాగ్రత్తగా మెయిన్‌టెయిన్ చేసే క్రమంలో.. ఏమేం చెయ్యకూడదో అన్నీ చేస్తుంటాడు.
డ్రగ్స్ తీసుకోవడం లాంటివి కూడా ఇందులో భాగమే. అవి ప్రాణాల్ని తోడేస్తాయ్.! అయినా, తగ్గేదే లే.!
నేటి కుర్రకారు.. బాడీ బిల్డింగ్ పోటీల కోసం కాదు.. అమ్మాయిల్ని పడగొట్టడానికో.. అందరిలో తాము ప్రత్యేకమమని చూపించుకోడానికో.. నానా పాట్లూ పడుతున్నారు.
ఈ క్రమంలో రకరకాల మందులు, డ్రగ్స్ వాడేసి.. కండలు పెంచేస్తున్నారు. జిమ్‌కి వెళ్ళి.. చిన్నపాటి కసరత్తులు చేస్తున్న సమయంలోనూ ప్రాణాలు కోల్పోతున్నవారెందరో.!
210 కిలోల బరువు.. ప్రాణం తీసింది..
ఇక్కడ.. మనం ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి.. ఏకంగా 210 కిలోల బరువు ఎత్తేందుకు ప్రయత్నించి, కుప్పకూలిపోయాడు.
సహాయకుడు పక్కనే వున్నాడు.. కానీ, ఏం చేయలేకపోయాడు. అంత బరువునీ, అతని భుజాలు మోయలేకపోయాయ్.. భారమంతా మెడ మీద పడింది.
తలకాయ ఒక్కసారిగా కిందికి వాలిపోయింది.. అంతే, క్షణాల్లో ప్రాణం పోయింది. ఇండోనేసియాకి చెందిన బాడీ బిల్డర్ ఈయన.!
జిమ్‌కి వెళుతున్నారా.? ప్రమాదకరమైన కసరత్తులు చేస్తున్నారా.? జర జాగ్రత్త.! బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు కూడా.. ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే.!