Brick Biryani Hyderabad.. హైద్రాబాద్ అంటేనే, బిర్యానీకి కేరాఫ్ అడ్రస్.! ఇది అందరికీ తెలిసిన విషయమే.! హైద్రాబాద్ బిర్యానీ టేస్ట్.. ఇంకెక్కడా దొరకదంటారు బిర్యానీ ప్రియులు.!
ప్రపంచంలో ఎక్కడ ఏ మూల బిర్యానీ గురించిన చర్చ జరిగినా, హైద్రాబాదీ బిర్యానీ పేరు ప్రస్తావనకు వస్తుందనడం అతిశయోక్తి కాదేమో.!
ఒకప్పుడు హైద్రాబాద్ మాత్రమే హైద్రాబాదీ బిర్యానీకి ఫేమస్.! ఇప్పుడు, ఆ ‘హైద్రాబాద్ బిర్యానీ’ ఓ బ్రాండ్లా తయారైంది. ఎక్కడికక్కడ ఈ పేరుతో బిర్యానీలు వండి వడ్డించేస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.
కొత్తగా.. సరికొత్తగా.. ఇప్పుడు బిర్యానీ తయారీదారులు తమ తమ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. కుండ బిర్యానీ, బకెట్ బిర్యానీ, డబ్బా బిర్యానీ, బిందె బిర్యానీ.. అబ్బో, చాలా రకాలుగా.!
Brick Biryani Hyderabad.. ఇటుక బిర్యానీ కూడా.!
తాజాగా, ఇటుక బిర్యానీ కూడా రంగంలోకి దిగిందండోయ్.! హైద్రాబాద్‌లోని ఓ ఔత్సాహిక బిర్యానీ తయారీదారు, ‘ఇటుక బిర్యానీ’ పేరుతో బిర్యానీ అమ్మకాలు షురూ చేశారు.
ఇంకేముంది.? ఈ ఫార్మాట్లో ఇప్పుడు మరికొంతమంది ‘ఇటుక బిర్యానీ’ (Brick Biryani) తయారీకి సన్నాహాలు చేసేస్తున్నారు.

ఇటుక ఆకారంలో మట్టితో తయారు చేసిన పాత్రలాంటి వస్తువులో బిర్యానీని వండి, విక్రయిస్తుండడంతో, ఆ మట్టి తాలూకు వాసన.. అదనంగా ఈ బిర్యానీకి కొత్త రుచిని తీసుకొస్తోందిట.!
అలాగని, భోజన ప్రియులు అంటున్నారు మరి. బిర్యానీ మీద విపరీతమైన మమకారం వాళ్ళతో అలా మాట్లాడిస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి.!
బిర్యానీ.. ఆ కిక్కే వేరప్పా.!
అన్నట్టు, బొంగులో బిర్యానీ తెలుసు కదా.! అది ఎప్పటినుంచో అందులో వుంది.! ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో దీన్ని విక్రయిస్తుంటారు.!
అక్కడి టేస్ట్‌తో పోల్చితే, నగరాల్లో పట్టణాల్లో తయారయ్యే అదే పేరు గల బిర్యానీకి అంత టేస్ట్ వుండదనుకోండి.. అది వేరే సంగతి.
కుండలో తయారు చేస్తే, కుండ బిర్యానీ.. ఎలా తయారు చేసినా.. బకెట్లో పోసి అమ్మితే, అది బకెట్ బిర్యానీ.! పేర్లు మాత్రం అదిరిపోతున్నాయ్.! పేరు ఏదైతేనేం, బిర్యానీ.. అనగానే చవులూరిపోతాయ్.!
Also Read: సామాజికోన్మాదం.. సమాజ వినాశనానికి సంకేతం.!
బిర్యానీపై అతి ప్రేమ కారణంగా, అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయ్.! అతి సర్వత్ర వర్జయేత్.. అని పెద్దలు ఊరకే అన్నారా.?
జర జాగ్రత్త.. బిర్యానీ మీద ఇష్టం వుండటం తప్పు కాదు.! దేనికైనా ‘లిమిట్’ అవసరం.! దేంట్లో తయారవుతోందో.. ఎలా తయారు చేస్తున్నారో.. తెలుసుకోవడం కూడా మంచిదే సుమీ.!
ఆరోగ్యం మహాభాగ్యం మరి.!