Table of Contents
Bro The Avatar Prudhviraj.. సినిమా అన్నాక.. అందులో చాలా మ్యాజిక్కులుంటాయ్.! సినిమా ఓ బలమైన మాధ్యమం. ఇది అందరికీ తెలిసిన విషయమే.!
స్వర్గీయ ఎన్టీయార్‌ని టార్గెట్‌గా చేసుకుని కూడా సినిమాలొచ్చాయ్. సినిమా, రాజకీయం.. ఈ రెండిటినీ విడదీసి చూడలేం.
ఆయా రాజకీయ నాయకులకు అనుకూలంగానూ.. వ్యతిరేకంగానూ సినిమాలు వస్తుంటాయ్. ఇది క్రియేటివ్ ప్రపంచం.!
అంతిమంగా, ‘సేల్ పాయింట్’ అనేది కీలకం.. సినిమాకి సంబంధించి. ఏదన్నా అంశం బాగా సేల్ అవుతుందంటే, అది సినిమాల్లోకి వచ్చేస్తుంటుంది.!
రాజకీయం కూడా ఇప్పుడు సేల్ పాయింట్.! సో, సినిమాల్లో రాజకీయాల్ని పరోక్షంగా టచ్ చేస్తే అందులో వింతేముంది.?
Bro The Avatar Prudhviraj .. ఇంతకీ ఎవరీ శ్యాంబాబు.?
‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర ఒకటి వుంటుంది. చాలా చిన్న పాత్ర అది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఆ పాత్రలో కనిపించాడు.
నిజానికి, ఆ పాత్రని తొలుత పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఆ పాత్రని మంత్రి అంబటి రాంబాబుతో పోల్చుతూ సోషల్ మీడియాలో హంగామా షురూ అయ్యేసరికి సీన్ మారిపోయింది.!

వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయాన్ని లైట్ తీసుకుని వుంటే బావుండేది. ఒకవేళ మీడియా అడిగినా, ‘నాన్సెన్స్’ అని కొట్టి పారేయాల్సింది.
కానీ, ఆయనలా చేయలేదు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తననే అలా చూపించారంటూ గుస్సా అయిపోయారు.
Bro The Avatar Shyambabu.. పృధ్వీకి భలే ఛాన్సులే..
దాంతో, శ్యాంబాబు పాత్రలో కనిపించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి అవకాశం దొరికింది. పైగా, వైసీపీని వీడి.. ఆ పార్టీ మీద పీకల్లోతు మంటతో వున్నాడు పృధ్వీ.
జనసేన పార్టీ మద్దతుదారుడిగా కూడా వున్న పృధ్వీ, రాజకీయంగా మాట్లాడలేదుగానీ.. సెటైర్ అయితే వేసేశాడు.
‘దర్శకుడు నాకు ఆ పాత్ర గురించి చెబుతూ, శ్యాంబాబు అనే వ్యక్తి.. ఓ పనికిమాలిన వెధవ.. ఓ బాధ్యత లేని వెధవ..’ అని అన్నారంటూ వివరించాడు.
‘బార్లలో పడి తాగుతుంటాడు.. అమ్మాయిలతో కలిసి డాన్స్ చేస్తుంటాడు శ్యాంబాబు.. ఇదీ శ్యాంబాబు పాత్ర గురించి నాకు చెప్పిన విషయం. నేను అలాగే చేశాను..’ అన్నది పృధ్వీ వెర్షన్.
‘అంబటి రాంబాబు ఎవరో నాకు తెలీదు. అయినా, ఆయనేమన్నా ఆస్కార్ స్థాయి నటుడా ఆయన్ని నేను ఇమిటేట్ చేయడానికి.?’ అని పృధ్వీ ఎదురు ప్రశ్నించడం కొసమెరుపు.!
ఓ సినిమాలో ఓ చిన్న పాత్రని తనకు ఆపాదించేసుకోవడం.. బాధ్యతగల మంత్రి పదవిలో వున్న వ్యక్తికి సబబేనా.? ఇది చిన్నతనం అనిపించడంలేదా.?
పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేసే క్రమంలో..
రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో.. ప్రతి చిన్న విషయానికీ.. తమ స్థాయిని తామే తగ్గించేసుకోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది.
ఇక వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు కొందరు, తమకు మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మీదనున్న అక్కసు వెల్లగక్కుకునేందుకు.. శ్యాంబాబు పాత్ర పేరుతో మరింత యాగీ చేస్తున్నారు.!
లైట్ తీసుకోవాల్సిన విషయంపై యాగీ చేయడమంటే అంతకన్నా పరువు తక్కువ వ్యవహారం ఇంకేముంటుంది.?
పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అక్కసుతో, రామ్ గోపాల్ వర్మ ద్వారా పనికిమాలిన సినిమాల్ని పనిగట్టుకుని మరీ తీయిస్తున్న వైసీపీ.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ చిన్న పాత్ర విషయంలో ఇంతలా ఉలిక్కపడటమేంటి.?
దీన్నే ‘భయం’ అంటారేమో.!