Bro The Avatar Making.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పాటంటే ఎలా వుండాలె.! ఆ రేంజ్ ‘పవర్’ ఖచ్చితంగా వుండి తీరాలె.!
ప్చ్.. ‘బ్రో’ సినిమా నుంచి వచ్చిన ‘మై డియర్ మార్కండేయ’ లిరికల్ సాంగ్‌లో ఆ పవర్ మిస్ అయ్యింది.! సర్లే, పవన్ కళ్యాణ్ స్టైలింగ్ చూసి.. సరిపెట్టేసుకున్నారు అభిమానులు.
విషయం మేకర్స్ వరకూ వెళ్ళినట్లుంది. అభిమానుల్లో జోష్ నింపేందుకు, ‘బ్రో’ నుంచి ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ మేకింగ్ వీడియోని దించారు.
Bro The Avatar Making.. మేకింగ్ అదిరింది గురూ.!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎనర్జీ ఆన్ స్క్రీన్ కంటే.. ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా వుంటుందంటారు ఆయనతో పని చేసిన చాలామంది దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. సహ నటులు.
కనిపిస్తోంది కదా.. ఆ ఎనర్జీ.! మేకింగ్ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) జోష్.. ఇది వేరే లెవల్.!
నిజానికి, యాక్షన్.. కట్.. ఇవేవీ లేకుండా.. ఈ మేకింగ్ వీడియోనే సాంగ్‌లా వదిలేసి వుంటే బావుండేదేమో.. అన్న భావన కలుగుతోంది అభిమానులకి.
ఊపొస్తోంది..
ఇప్పుడు.. ఈ మేకింగ్ వీడియో తర్వాత, ‘మై డియర్ మార్కండేయ’ లిరికల్ వీడియో సాంగుకి సైతం యూ ట్యూబ్‌లో జోష్ మరింత పెరిగినట్లే కనిపిస్తోంది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) సరసన ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సముద్రఖని ఈ ‘బ్రో’ చిత్రానికి దర్శకుడు. ఆయన నటించి దర్శకత్వం వహించిన ‘వినోదియ సితం’ తెలుగు రీమేక్ ఈ ‘బ్రో’ (Bro The Avatar).
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఒరిజినల్ వెర్షన్‌కి చాలా మార్పులు తెలుగు రీమేక్ కోసం చేశారు. అవేంటో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.
జులై 28న ‘బ్రో ది అవతార్’ (Bro The Avatar) ప్రేక్షకుల ముందుకు రానుంది.