BTech Pani Puri Wali.. కాదేదీ కవితకనర్హం అన్నాడో మహా కవి.! కాదేదీ బిజినెస్సుకనర్హం అంటోందీ పానీ పూరీ పోరీ.! ఆమె బీటెక్ చదివింది.. పానీ పూరీ అమ్ముతోంది.
పైగా, ‘బీటెక్ పానీ పూరీ వాలీ’ అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటోంది. బుల్లెట్టు బండి మీద తిరుగుతూ ఈ పానీ పూరీ వ్యాపారాన్ని చేస్తోందామె.
ఎవరామె.? ఏంటా కథ.? అసలు విషయంలోకి వెళితే, ఆమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్ (Tapsi Upadhyay). ఢిల్లీకి చెందిన తాప్సీ బీటెక్ విద్యనభ్యసించింది.
BTech Pani Puri Wali.. మహిళ.. మహరాణి.!
ఆరోగ్యకరమైన, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అందించడాన్ని ఉపాధిగా మార్చుకుంది. ‘బీటెక్ పానీ పూరీ వాలీ’గా మారి, సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసింది తాప్సీ (Tapsi Upadhyay).
బైక్ మీద వెళుతూ.. ఆ బైక్‌కి పానీ పూరీ బండిని లింక్ చేసి.. వీధుల్లో తిరుగుతూ, రోడ్డు పక్కనే దుకాణం తెరిచేస్తోంది. చిన్న వ్యాపారం ఏమీ కాదిది.. దీన్ని ఓ ఫ్ఱాంఛైజీగా కూడా మార్చేసింది.
‘ఏ వ్యాపారమూ చిన్నది కాదు. ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్, ఆహార ప్రియులకు అందించాలన్నదే నా ఆలోచన. దాన్ని ఉపాధిగా మలచుకున్నాను.. దీన్ని ఫ్రాంఛైజీగా మార్చుతున్నాను..’ అని చెప్పింది తాప్సీ.
ఏదైనా సాధించగలదామె..
‘నా దేశంలో మహిళ ధైర్యంగా రోడ్ల మీద ఒంటరిగా తిరగగలదు.. మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదు..’ అంటోంది తాప్సీ ఉపాధ్యాయ్.
మరోపక్క, తాప్సీ ఉపాధ్యాయకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సూపర్ గర్ల్.. బిజినెస్ విమెన్..’ అంటూ తాప్సీ ఉపాధ్యాయ్‌ని కొనియాడుతున్నారు.
Also Read: Nokia Connecting People.! నోకియా అంటే అదొక ఎమోషన్.!
అంతే కాదు, తాప్సీ ఉపాధ్యాయ నిర్వహిస్తున్న పానీ పూరీ బండి వద్దకు జనం క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత, ఆ పానీ పూరీ టేస్ట్ కోసం ఎగబడుతున్నారట.
‘కేవలం టేస్ట్ తెలుసుకోవడం గురించే కాదు.. ఆమెను చూసి స్ఫూర్తి పొందేందుకు కూడా..’ అంటూ తాప్సీ ఉపాధ్యాయ (Tapsi Upadhyay) పూరీ బండి వద్ద క్యూ కడుతున్న యువత చెబుతున్నారు.