Catherine Opposite Megastar Chiranjeevi.. ఎమ్మెల్యే అంటే ఓ అందమైన అర్ధం చెప్పాడు ఓ సినిమాలో హీరో. ఆ సినిమాలో హీరోయిన్ పోషించిన పాత్ర ఎమ్మెల్యే.
అదేనండీ.! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో అందాల భామ కాథరీన్ ట్రెసా ఎమ్మెల్యే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఆ అందాల ఎమ్మెల్యే గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో కేథరీన్ నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్సే. బ్యాడ్ లక్ ఏంటంటే, కేథరీన్ ఆయా సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గానే నటించింది.
అయితేనేం, ఆమెకున్న క్రేజ్ మాత్రం వేరే లెవల్ సినిమా హిట్టు పరంగా. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాకి అదే సక్సెస్ ఫార్ములాని అనుసరిస్తున్నాడనుకోవచ్చేమో.!
Catherine Opposite Megastar Chiranjeevi.. అనిల్ రావిపూడి హిట్టు ఫార్ములా..
అఫ్‌కోర్స్.! అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్సే అనుకోండి.! లేటెస్ట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సహా.
ఇప్పుడీ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయ్ ఈ సినిమాకి. అలాగే కాస్టింగ్ డిస్కషన్స్ కూడా. అందులో భాగంగానే హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు..? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
లేడీ సూపర్ స్టార్ నయనతారను దాదాపు హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని ఇన్‌సైడ్ టాక్. అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్‌కీ చోటుందట.
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కేథరీన్
ఆ ప్లేస్ కోసమే అనిల్ రావిపూడి కేథరీన్ ట్రెసాని తీసుకోవాలనుకుంటున్నాడట. గతంలో కేథరీన్‌కి మంచి హిట్టు ట్రాక్ వున్న దర్మిలా ఏరి కోరి ఆమె తీసుకురావాలనుకుంటున్నాడట అనిల్ రావిపూడి.
Also Read: జలకాలాటలలో ‘కొత్త గులాబీ’.. కుషిత.!
అయితే, ఈ విషయమై ఇంకా క్లారిటీ రావల్సి వుంది. ఇప్పటికే పలు మెగా ప్రాజెక్టుల్లో కేథరీన్ నటించింది. అన్నట్లు మెగాస్టార్ సినిమాలో ఆల్రెడీ కేథరీన్ నటించింది.
అదే ‘వాల్తేర్ వీరయ్య’. ఈ సినిమాలో రవితేజకి జోడీగా నటించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే జత కట్టబోతోంది. ఓ రకంగా కేథరీన్‌కిది గోల్డెన్ మెగా ఛాన్సే అని చెప్పాలి.