Chandini Chowdary IPL Cricket.. తెలుగు తెరపై తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువైపోతున్నాయంటూ ఓ పక్క గుస్సా అవుతూనే, ఆ తెలుగమ్మాయిల్ని వివాదాల్లోకి లాగుతుంటారు.!
చాందిని చౌదరి.. పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.! చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్.. అనదగ్గ స్టామినా వున్న నటి.
మొన్నీమధ్యనే విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘గామి’ సినిమాలో కనిపించింది చాందిని చౌదరి.! చేతిలో ప్రస్తుతానికి సినిమాలు బాగానే వున్నాయ్.!
ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో కూడా దర్శనమిచ్చింది.. మంచి మార్కులే పడ్డాయామె నటనకి.! తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది చాందిని చౌదరి.
Chandini Chowdary IPL Cricket.. క్లీన్ బౌల్డ్ చేసేద్దామనుకున్నారుగానీ..
క్రికెట్ అంటే అందరికీ ఇష్టం వుండాలనే రూల్ ఏమైనా వుందా.? అందునా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద ఎంతమందికి ఇంట్రెస్ట్ వుంటుంది.? అదో జూదం.. అంటారు కొందరు.
ఐపీఎల్‌లో మీకు ఏ టీమ్ ఇష్టం.? హైద్రాబాద్ జట్టు అంటే ఇష్టమేనా.? అనడిగారు ఓ సినీ ఎర్నలిస్ట్ తాజాగా, ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో.
తనకు క్రికెట్ మీద పెద్దగా అవగాహన లేదనీ, ఆసక్తి కూడా లేదనీ, స్టేడియంలో ఎప్పుడూ మ్యాచ్ చూడలేదనీ, చూస్తే ఆ తర్వాత క్రికెట్ గురించి మాట్లాడతానని చెప్పిందామె.
అంతే కాదు, ‘మాది ఆంధ్రా కదా.. ప్రస్తుతానికి ఆంధ్రాకి ఏ టీమ్ లేదు కదా.. సో, నేనెవరికీ సపోర్ట్ చేయను..’ అనేసింది చాందిని.
అంతే, తెలంగాణలో వుంటున్నావ్.. హైద్రాబాద్ జట్టుకి సపోర్ట్ చెయ్యవా.? అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలెట్టారు.

అంతేనా, ఆంధ్ర ప్రదేశ్‌కి ఐపీఎల్ క్రికెట్ టీమ్ లేదని ఎగతాళి చేస్తావా.? అని అటువైపు నుంచీ ట్రోలింగ్ షురూ అయ్యింది.
ఏదో క్యాజువల్‌గా పేల్చిన డైలాగ్, ఆమెనిలా వివాదాల్లోకి లాగేసింది.!
ఆ మధ్య ‘గామి’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా, ‘హీరోయిన్లను సినిమా గురించి ఏమీ అడగరు..’ అంటూ మీడియాపై చాందిని గుస్సా అయిన సంగతి తెలిసిందే.
Also Read: ‘డార్లింగ్’ నభా నటేష్.! అందాల రాక్షసిలా మారిపోయిందే.!
తెలుగమ్మాయిల్ని తెలుగు సినిమాలో ప్రోత్సహించకపోయినా ఫర్లేదుగానీ, ఈ ట్రోలింగ్ ఏంటి ఛండాలంగా.? ఇలాంటి కామెంట్లకి ముంబై భామలైతే, ‘ఛల్ హట్’ అనేసి లైట్ తీస్కుంటారు.!
‘టెల్గు’ భామ కదా, ఇంకా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.! అదే లోకువ మరి.!