China Alien.. చైనా వస్తువులంటే, మన దేశంలో వున్న అభిప్రాయాలు వేరు. కానీ, కరోనా వైరస్ విషయంలో మాత్రం, చైనా బ్రాండ్ గురించి ప్రపంచమంతా ‘ప్రత్యేకంగా గుర్తించాల్సి’ వచ్చింది.!
మరిప్పుడు చైనా ఏలియన్స్ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.? ప్రపంచంలో చాలా దేశాలు ఏలియన్స్ గురించిన పరిశోధనలు చేస్తున్నాయి.
ఏలియన్స్.. గ్రహాంతర వాసులు.. పేరు ఏదైతేనేం, విశ్వంలో భూమ్మీద కాకుండా, మరో చోట జీవం వుందా.? వుంటే, దాని వల్ల మనకేమైనా ముప్పు వుందా.? అన్న కోణంలో పరిశోధనలు జరుగుతూనే వున్నాయ్.
అలా పరిశోధనలు చేస్తున్న దేశాల్లో చైనా కూడా వుంది.
అదిగో యూఎఫ్ఓ, ఇదిగో ఏలియన్.!
అదిగదిగో ఫ్లైయింగ్ సాసర్.. ఇదిగో గ్రహాంతరవాసి.. అంటూ ఎప్పటినుంచో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వెతికితే కుప్పలు తెప్పలుగా ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తాయ్.!
గ్రహాంతరవాసులకు సంబంధించి అనేక ‘థియరీస్’ కూడా రూపొందించబడ్డాయ్.! ఏలియన్ సజీవంగా పట్టుబడిందనీ, దానికి అనేక పరీక్షలు చేశారనీ గతంలో కథనాలు కూడా వచ్చాయి.

అవన్నీ ఓ యెత్తు.. ఇప్పుడు చైనాకి, గ్రహాంతర వాసులతో ‘లింక్’ దొరికిందంటూ జరుగుతున్న ప్రచారం ఇంకో యెత్తు.!
China Alien.. ఇది చైనా ఏలియన్.!
కోవిడ్ వైరస్ విషయంలో చైనాని ప్రపంచమంతా నమ్మి తీరాల్సి వచ్చింది. ఎందుకంటే, అంత సమర్థవంతంగా కరోనా వైరస్‌ని చైనా తయారు చేసి, ప్రపంచం మీదకు వదిలిందనే వాదనలు చాలానే వున్నాయి.
Also Read: అంబాసిడర్ కారుకి ఆ రాజసం మళ్ళీ దక్కేనా.?
సో, ఏలియన్ విషయంలో చైనా చెబుతున్న విషయాల్ని నమ్మక తప్పదు. పైగా, ఈ చైనా మాట నిజమే అయితే, మాత్రం.. ముమ్మాటికీ అది ప్రపంచానికి పెను ముప్పు కాబోతోంది.
చైనా తయారీ కరోనా వైరస్‌నే వదిలించుకులేకపోతున్న మానవాళి, చైనా ఏలియన్స్‌ని తట్టుకోగలదా.?
అయినా, ఏలియన్ అనగానే ఎందుకు భయపడాలి.? మనిషి కంటే శక్తివంతమైనదీ కావొచ్చు.. మనిషి కంటే బలహీనమైనదీ కావొచ్చు.! సో, ఏలియన్ గురించి మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి.
కాకపోతే, చైనా ఏలియన్.. అన్న ప్రస్తావనే కొంత ఆందోళన కలిగిస్తోంది. అదీ అసలు సంగతి.