Chiranjeevi Bhola Harish Shankar.. చిరంజీవి.. నూట యాభైకి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్.! సినీ రంగంలో ఆయన చూడని విజయాలు ఏముంటాయ్.? ఆయన సాధించని ఘనతలు ఏముంటాయ్.?
చాలా తక్కువ మందికే మెగాస్టార్ చిరంజీవి ఘనత అర్థమవుతుంది. ఎందుకంటే, చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు గనుక. అర్థమయినా, అర్థం కానట్టు వ్యవహరిస్తారు గనుక.!
దర్శకుడు హరీష్ శంకర్, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఇటీవల ఓ ఈవెంట్‌లో.
Chiranjeevi Bhola Harish Shankar.. మీరు చూడని విజయాల్లేవ్..
‘వాల్తేరు వీరయ్య’ 200 డేస్ ఫంక్షన్ అది. ఈ వేదికపై మాట్లాడిన హరీష్ శంకర్ (Harish Shankar), ‘అన్నయ్యా.. మీరు చూడని విజయాల్లేవ్..’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘మీరు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం వల్ల మాలాంటి ఎంతోమంది దర్శకులకు మేలు జరుగుతోంది..’ అన్నాడు హరీష్ శంకర్.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో దర్శకుడు బాబీ సెటిల్ అయ్యాడనీ, ‘భోళా శంకర్’ సినిమాతో మెహర్ రమేష్‌కి మంచి పేరు రాబోతోందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.
మాకోసం సినిమాలు చేస్తున్న చిరంజీవి..
హరీష్ శంకర్ మాటల్లో నిజం వుంది. చిరంజీవి ఎందుకు రీమేక్ సినిమాలు చేస్తున్నారు.? చిరంజీవి ఎందుకు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు.? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయ్.
ఆ ప్రశ్నలకు సమాధానం.. చిరంజీవి, తన కోసం సినిమాలు చేయట్లేదు. తన పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన సినిమాలు చేయట్లేదు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
తన సినిమాలతో వందలాది మందికి, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించాలనీ, యంగ్ డైరెక్టర్స్‌కి సక్సెస్ రావాలనీ సినిమాలు చేస్తున్నారు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.!
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా హరీష్ శంకర్ కూడా ఓ సినిమా తెరకెక్కిస్తాడనే ప్రచారం జరుగుతోంది.