Chiranjeevi Bholaa Shankar Politics.. సినిమా పరిశ్రమని ‘పిచ్చుక’తో పోల్చారు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. అంటే, ఇక్కడ బ్రహ్మాస్త్రంగా రాజకీయాన్ని అనుకోవాలేమో.!
ప్రత్యేక హోదా, రోడ్లు, అభివృద్ధి.. ఇలాంటి పెద్ద విషయాల మీద ఫోకస్ పెట్టకుండా, సినీ పరిశ్రమని ఎందుకు టార్గెట్ చేస్తారంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించి 200 రోజుల వేడుక నిర్వహించారు. చిత్ర యూనిట్‌కి షీల్డ్స్ అందించే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సినిమా పెద్ద విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సినిమా షూటింగ్‌లో అనుభూతుల్ని నెమరువేసుకున్నారు. ఈ క్రమంలోనే, సినీ పరిశ్రమపై నడుస్తున్న రాజకీయంపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయ అలజడి..
సహజంగానే ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అలజడికి కారణమయ్యాయి. ఇటీవల ‘బ్రో’ సినిమాపై ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ మంత్రులు, తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
సినిమా డిజాస్టర్ అనీ, కలెక్షన్లు దారుణంగా వచ్చాయని ఓ మంత్రి మీడియా ముందుకొచ్చి రివ్యూలు చెప్పి, కలెక్షన్ల వివరాల్ని చెప్పుకొచ్చారు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించీ యాగీ చేశారు.
ఇంకో అడుగు ముందుకేసి, రాజ్యసభలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ప్రస్తావన తీసుకొచ్చారు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడొకరు.

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాల్ని వైసీపీ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాధితుల లిస్టులోకి హీరో నాని కూడా చేరిపోయాడు.
ఇప్పుడిక మెగాస్టార్ చిరంజీవికీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సెగ తప్పేలా లేదు. ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Chiranjeevi Bholaa Shankar Politics.. రాజకీయాలెందుకు.?
సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, చిరంజీవి ఎందుకు రాజకీయాల్ని ప్రస్తావించారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
అయితే, సినీ పరిశ్రమకు రాజకీయ వేధింపులు వుండకూడదనే విజ్ఞప్తి మాత్రమే చిరంజీవి చేశారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
ఔను మరి.. నటీనటుల రెమ్యునరేషన్లతో రాజకీయ నాయకులకి ఏం పని.? చట్ట సభల్లో ఈ అంశంపై చర్చించాల్సిన అగత్యం ఏం ఏర్పడింది.? చిరంజీవి మాత్రమే కాదు.. మొత్తం సినీ పరిశ్రమ ఈ అంశంపై స్పందించాల్సి వుంది.
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
కాగా, ‘భోళా శంకర్’ సినిమాపై వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ కూడా బురద చల్లుతోంది. ఈ క్రమంలోనే చిరంజీవి, అందరికీ కలిపి తనదైన స్టయిల్లో కౌంటర్ ఎటాక్ ఇచ్చారన్న వాదనా లేకపోలేదు.