Chiranjeevi Bholaa Shankar Trailer.. అసలు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రీమేక్ సినిమాలు చేస్తున్నట్లు.? పవన్ కళ్యాణ్ ఎందుకు రీమేక్ సినిమాల్ని ఆశ్రయిస్తున్నట్లు.?
పవన్ కళ్యాణ్ సంగతి తర్వాత.. ముందైతే, లేటెస్ట్‌గా ‘భోళా శంకర్’ (Bholaa Shankar) ట్రైలర్ వచ్చేసింది గనుక, మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుందాం.
తమిళ సినిమా ‘వేదాలం’కి ఇది తెలుగు రీమేక్. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Chiranjeevi Bholaa Shankar Trailer.. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యం..
మహిళలకు సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ అత్యంత సీరియస్ అంశం. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల్లో మగాళ్ళు కూడా వుంటారనుకోండి.. అది వేరే సంగతి.
‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా నేపథ్యమే, హ్యూమన్ ట్రాఫికింగ్ చుట్టూ తిరుగుతుంది. దానికి చెల్లెలి సెంటిమెంట్ కనెక్టివిటీ.!
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఒకటి.!
ట్రైలర్ ఎలా వుంది.!
చాలా సార్లు వింటుంటాం.. షుగర్ కోటెడ్ పిల్ అని.! ‘భోళా శంకర్’ సినిమా కూడా అంతే.! మెగాస్టార్ చిరంజీవి టైమింగ్ ఈ సినిమాకి స్పెషల్.!

విలన్ మీద విసిరే పంచ్ డైలాగులు కావొచ్చు.. గ్లామరస్ బ్యూటీస్ మీద రొమాంటిక్‌గా వేసే వన్ లైనర్ సెటైర్లు కావొచ్చు.. చిరంజీవి తర్వాతే ఎవరైనా.!
Also Read: Isha Talwar.. గుండె జారి గల్లంతయ్యిందే.!
యాక్షన్.. ఎంటర్టైన్మెంట్.. వీటితోపాటు.. ఓ చక్కటి మెసేజ్.. ఇదీ ‘భోళా శంకర్’ (Bholaa Shankar) ప్రత్యేకత.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ‘బ్రో’ అనేది జస్ట్ సినిమా కాదు.. అది జీవితం.! ఇదీ మెగా రీమేక్స్ వెనుక అసలు కథ.!
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోళా శంకర్’ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.