Chiranjeevi Blood Bank Jeevitha Rajasekhar నేరం చేయించిన వ్యక్తి.. ఇప్పుడు జీవించి లేరు.! కానీ, నేరం చేసినవాళ్ళు మాత్రం శిక్ష అనుభవించక తప్పేలా లేదు.!
న్యాయం జరగడం కాస్త ఆలస్యం కావొచ్చు.. కానీ, న్యాయం జరిగి తీరుతుంది. ఇంతకీ, శిక్ష పడినట్టేనా.? తప్పించుకుంటారా.?
సినీ నటి జీవిత, సినీ నటుడు రాజశేఖర్.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వుండేవారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయం అది.
చిరంజీవి మీద రాజకీయ విమర్శలు చేయడానికి ఏముంటుంది.? కానీ, రాజకీయం ఏమైనా చేస్తుంది.! చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ మీద అర్థం పర్థం లేని రాజకీయ విమర్శలు చేశారు.
Chiranjeevi Blood Bank Jeevitha Rajasekhar.. కాంగ్రెస్ పార్టీ వాడకం.. జీవిత, రాజశేఖర్ మూర్ఖత్వం..
ఈ విమర్శల కోసం జీవిత, రాజశేఖర్‌లను కాంగ్రెస్ పార్టీ వాడుకుంది అప్పట్లో. జీవిత, రాజశేఖర్‌లకి చిరంజీవి అంటే ఏంటో తెలుసు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఎంత గొప్పదో తెలుసు.!
తెలిసీ, చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నారంటూ జీవిత, రాజశేఖర్ దారుణమైన విమర్శలు చేశారు. ఫలితం అనుభవిస్తున్నారు.

తాజాగా, జీవిత అలాగే రాజశేఖర్‌లకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అయితే, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ప్రస్తుతానికి జరీమానాతో సరిపెట్టింది.
గడువు లోపల జీవిత, రాజశేఖర్ పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడా ఈ జైలు శిక్ష సమర్థింపబడితే, ఈ సినీ దంపతులు జైలుకు వెళ్ళక తప్పదేమో.!
తప్పు తెలుసుకున్నారుగానీ.. శిక్ష తప్పేలా లేదు..
వాస్తవానికి, జీవిత అలాగే రాజశేఖర్.. తమ తప్పుని ఏనాడో తెలుసుకున్నారు. చిరంజీవిని కలిసి క్షమాపణ కూడా చెప్పారట. అయినాగానీ, పరువు నష్టం దావా కేసు అయితే కొనసాగుతూనే వచ్చింది.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్.. ఈ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. వందల మందికి.. వేల మందికి.. లక్షల మందికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సకాలంలో రక్తం అందింది.
ఎన్నో వేల ప్రాణాలు.. లక్షల ప్రాణాలు నిలబెట్టగలిగింది చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్. నిస్సిగ్గు రాజకీయంలో జీవిత, రాజశేఖర్ భాగస్వామ్యులయ్యారు.. ఫలితం అనుభవించక తప్పదు.!