Chiranjeevi Keerthy Suresh Bromance.. మెగాస్టార్ చిరంజీవి అంటేనే.. కామెడీ టైమింగ్‌కి కేరాఫ్ అడ్రస్.! స్పాంటేనియస్‌గా హ్యూమర్ సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.!
‘భోళా శంకర్’ సినిమా విడుదలకు సిద్ధమైన దరిమిలా, జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, ‘మహానటి’ కీర్తి సురేష్‌తో చేసిన ‘బ్రో’మాన్స్.. హాట్ టాపిక్‌గా మారింది.!
‘ఈ సినిమాలో చెల్లెలిగా నటించావ్. అది నటనకే పరిమితం. ముందు ముందు హీరో హీరోయిన్.. అన్న కోణంలో సినిమాలు చేద్దాం..’ అంటూ కీర్తితో చిరంజీవి చెప్పిన వైనం బోల్డంత ఫన్ క్రియేట్ చేసింది.
ఆద్యంతం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కెమెరాలన్నీ మెగాస్టార్ చిరంజీవి సెన్సాఫ్ హ్యూమర్‌ని, చిలిపితనాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాయి.
Chiranjeevi Keerthy Suresh Bromance.. ఆ అనుబంధం వేరే లెవల్..
తమిళ సినిమా ‘వేదాలం’కి ‘భోళా శంకర్’ (Bholaa Shankar) తెలుగు రీమేక్. ఇది అందరికీ తెలిసిన విషయమే.
అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం ఆ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యింది.! అంతకు మించి ‘భోళా శంకర్’లో చిరంజీవి, కీర్తి సురేష్ పాత్రల మధ్య ఆ అనుబంధం వర్కవుట్ కాబోతోంది.!

ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానో, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనో చిరంజీవి తన హ్యూమర్‌ని ప్రదర్శిస్తే, దాని చుట్టూ ట్రోలింగ్.. అత్యంత హాస్యాస్పదం.!
ఓ రకంగా, ఇది ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందనుకోండి.. అది వేరే సంగతి.
పనిగట్టుకుని చేసే విమర్శలు..
అయితే, చిరంజీవి (Mega Star Chiranjeevi) మీద పనిగట్టుకుని ఈ విషయంలో చేసే విమర్శలు ఒకింత జుగుప్సాకరంగా అనిపిస్తాయి.
కీర్తి సురేష్ తల్లి మేనకతో చిరంజీవి చాలకాలం క్రితం ‘పున్నమి నాగు’ సినిమాలో చేశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ‘భోళా శంకర్’ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక, కీర్తి సురేష్ (Keerthy Suresh) – చిరంజీవి (Mega Star Chiranjeevi) మధ్య ఆప్యాయ ఆలింగనానికి పెడార్ధాలు తీస్తున్నారు చాలామంది.
Also Read: Khushi Kapoor.. అక్క జాన్వీకి పోటీ.! ఇవ్వగలదా.?
కీర్తి సురేష్ స్వయంగా చిరంజీవి (Mega Star Chiranjeevi) వద్దకు వస్తే, చిరంజీవి రెండు చేతులు జోడించి సంస్కారవంతంగా నమస్కరించారు.
ఈ క్రమంలో కీర్తి సురేష్, చిరంజీవిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో వక్రీకరిస్తున్న తీరు.. అత్యంత దురదృష్టకరం.