Chiranjeevi Nayanthara Sasirekha MSG.. దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఏకంగా గుడి కొట్టేయొచ్చు! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు.!
‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ పెట్టడంతోనే, దర్శకుడు అనిల్ రావిపూడి ఆ అర్హతను సంపాదించేసుకున్నాడు.!
‘ఇంకాస్త పెద్ద గుడి కట్టేయొచ్చేమో..’ అని, అనిల్ రావిపూడి గురించి మెగాభిమానులు అనుకున్నారంటే, దానిక్కారణం ‘మీసాల పిల్ల’ లిరికల్ సాంగ్.!
చాలా చాలా పెద్ద గుడి కట్టెయ్యాలని మెగాభిమానులు భావిస్తున్నారంటే, ‘శశిరేఖ’ పాట తాలూకు లిరికల్ వీడియో ఆ స్థాయిలో అనిల్ రావిపూడి అండ్ టీమ్ డిజైన్ చేసింది మరి.!
Chiranjeevi Nayanthara Sasirekha MSG.. చిరంజీవి.. ఓ నడిచే యూనివర్సిటీ..
సీనియర్ హీరోలకు సినిమాలెందుకు.? అనే కామెంట్లు సోషల్ మీడియాలో చూస్తుంటాం. సీనియర్ హీరోలంటే, సినిమాకి సంబంధించి ‘యూనివర్సిటీస్’ లాంటోళ్ళు.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ స్పాట్‌లో లైట్ మ్యాన్ దగ్గర్నుంచి, కో-డైరెక్టర్ వరకూ, మెగాస్టార్ చిరంజీవిని చూసి ఎంతలా ఇన్‌స్పైర్ అయి వుంటారు.?
పాట చిత్రీకరిస్తున్నప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్.. ఎంత అద్భుతమైన అనుభూతికి లోనయి వుంటారు.? అసలు పాట రాసేటప్పుడు, లిరిసిస్ట్ ఎలా ఇన్‌స్పైర్ అయి వుండాలి.?
సినిమా ఎలా వుంటుంది.? అన్నది వేరే చర్చ. ‘మీసాల పిల్ల’ పాటతోనే సిక్సర్ కొట్టేశారు ‘మన శంకర వర ప్రసాద్’ గారు.! ఇకపై, సినిమా నుంచి వచ్చే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బోనస్ మాత్రమే.!
అన్నట్టు, ‘శశిరేఖ..’ అంటూ సాగే పాటలో, ‘ప్రసాదూ’ అని నయనతార అంటోంటే, మెగాస్టార్ చిరంజీవిలో ఆ రొమాంటిక్ కట్స్.. అది వేరే లెవల్ అంతే.
లొకేషన్స్ అదిరిపోయాయ్.. చిరంజీవి, నయనతార కాస్ట్యూమ్స్ వేరే లెవల్.! డాన్సుల్లో చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయనే ఓ డాన్స్ యూనివర్సిటీ.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, నయనతారతో చిరంజీవి ఇన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. అంతకు మించి.. అనాలేమో.!
