Chiranjeevi Pawan Kalyan Ramcharan Combination ‘ఆచార్య’ (Acharya) సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి ఓ మెగా కాంబినేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకోకుండా వుంటారా.? అలాంటి అభిమానుల్లో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు.
అందుకే, తన మనసులో మెదులుతున్న ప్రశ్నని, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ముందుంచేశారు హరీష్ శంకర్. దానికి చిరంజీవి తనదైన స్టయిల్లో సమాధానం కూడా ఇచ్చేశారు.
Chiranjeevi Pawan Kalyan Ramcharan Combination ఈ ముగ్గురూ ఎప్పుడు.?
‘ఆచార్య’ సినిమా తన భార్య సురేఖ కోరికతో తెరకెక్కిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ‘ఆచార్య’ సినిమా కంటే, చిరంజీవి – చరణ్ కాంబినేషన్ గురించి సురేఖ ఆలోచించారు.. ఆమె కోరుకున్నారు.. అలా జరిగిపోయిందంతే.

రామ్ చరణ్‌లానే పవన్ కళ్యాణ్‌ని కూడా తన సొంత కుమారుడిలాగానే సురేఖ చూసుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఆమెకు మరిది అయినాగానీ.
తన తల్లి సమానులైన సురేఖ గురించి పవన్ మాట్లాడేటప్పుడు.. ఆ వాత్సల్యం, గౌరవ భావం స్పష్టంగా కనిపిస్తుంటుంది.
బాబాయ్ హీరోగా నటించే సినిమాని నిర్మించాల్సి వస్తే.. తానెప్పుడూ సిద్ధంగానే వుంటానని చరణ్ గతంలో చెప్పాడు.
మరోపక్క, చరణ్‌తో పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఓ సినిమా నిర్మిస్తాడనే ప్రచారమూ గతంలో జరిగింది.
ఆరోజెంతో దూరంలో లేదు సుమీ.!
చిరంజీవి – పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. చిరంజీవి – చరణ్ కలిసి ‘ఆచార్య’ కోసం పని చేశారు. మరి, చిరంజీవి – చరణ్ – పవన్ కళ్యాణ్ కలిసి నటించేదెప్పుడు.?
‘ఆచార్య’ నిజమైంది కదా.. సో, ముందు ముందు మా ముగ్గురి కాంబినేషన్‌లో సినిమాకి ‘ఆచార్య’ బీజం వేసినట్లేనని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Also Read: సాయం చేసేవాడు దేవుడైతే.. నువ్వే ఆ దేవుడివి పవన్ కళ్యాణ్.!
ఇంతకీ, పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ (Pawan Kalyan Ram Charan Combo) కాంబినేషన్ ఎప్పుడు.? అది కూడా త్వరలోనే జరుగుతుందేమో.!
దీనికి పూనుకోవాల్సింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మాత్రమే.. అది ముగ్గురు మొనగాళ్ళు అయినా.. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ అయినా.!