Chiranjeevi Pawankalyan Mark Shankar.. అన్నయ్య ఎలా వుండాలి.? తమ్ముడికి, తండ్రి తర్వాత తండ్రిలా వుండాలి.! మరి, తమ్ముడెలా వుండాలి.? తండ్రి లాంటి ఆ అన్నయ్యకి కొడుకులా వుండాలి.!
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అచ్చం అలానే వుంటారు.! అన్నయ్య మీద ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే, తమ్ముడు చెలరేగిపోతాడు.
తమ్ముడికి అవసరం వస్తే, తండ్రిలా భుజం కాస్తాడు ఆ పెద్దన్నయ్య. మరో మెగా బ్రదర్ నాగబాబు సంగతి సరే సరి.! అందుకే, ఈ ముగ్గురు మెగా బ్రదర్స్‌నీ.. ముగ్గురు మొనగాళ్ళని అంటుంటాం.
Chiranjeevi Pawankalyan Mark Shankar.. మార్క్ శంకర్.. క్షేమంగా ఇంటికిి వచ్చేశాడు..
పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
విషయం తెలుసుకున్న పెదనాన్న చిరంజీవి తల్లడిల్లిపోయారు. తమ్ముడితో కలిసి సింగపూర్ వెళ్ళారు. చిరంజీవి వెంట, చిరంజీవి సతీమణి సురేఖ కూడా సింగపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే.
కుమారుడు మార్క్ శంకర్‌ని ఆసుపత్రిలో చూసి, పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురైతే, అన్నయ్య చిరంజీవి తన తమ్ముడిని ఓదార్చారట.
ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్‌ని డిశ్చార్జ్ చేయడంతో, ఇంటికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా, తమ్ముడితో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి.
‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’
అంటూ మెగాస్టార్ చిరంజీవి, తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పేర్కొన్నారు.
జనసేనకు వెన్నుదన్నుగా చిరంజీవి..
జన సేన పార్టీ కోసం 2024 ఎన్నికల సమయంలో, ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అందించిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ తరఫు, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు పోగొట్టుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయమందించేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని చిరంజీవి అప్పట్లో ఆకాంక్షించారు.
ఆ ఐదు కోట్ల రూపాయల విరాళం అనేది అప్పట్లో, ‘మెగా స్టేట్‌మెంట్’ అయ్యింది. జనసేన పార్టీ తిరుగులేని విజయం సాధించడం వెనుక, ఆ ‘మెగా సపోర్ట్’ కీలక భూమిక పోషించింది.
అన్నట్టు, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరులోని ‘శంకర్’ అంటే, చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ నుంచి తీసుకున్నదే.!