Chiranjeevi Ram Charan Alluri.. ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు.. అంటే, సూపర్ స్టార్ కృష్ణ. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం, దాన్ని నార్త్ ఇండియన్స్ ఏకంగా రాముడితో పోల్చారు.. ఆరాధించారు కూడా.
తద్వారా నార్త్ బెల్ట్‌లో రామ్ చరణ్‌కి అనూహ్యమైన రీతిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా అభిమానగణం ఏర్పడటం తెలిసిన విషయమే.
అలా రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఈ తరానికి అల్లూరి సీతారామరాజు అయిపోయాడనడం అతిశయోక్తి కాదు.
అల్లూరి విగ్రహావిష్కరణ – మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకోసం మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది.
భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆవిష్కరించనున్నారు.
ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేపథ్యంలో, ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారాయన.
సినీ నటుడిగా ఆయనకున్న పాపులారిటీ, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు, వీటికితోడు.. మెగాస్టార్ చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలు.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Chiranjeevi Ram Charan Alluri.. అరుదైన గౌరవం.!
కాకతాళీయమే అయినా.. అల్లూరి గెటప్‌లో రామ్ చరణ్, ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో దేశం దృష్టిని ఆకర్షిస్తే, ఆ అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో చిరంజీవి (Mega Star Chiranjeevi), వేదికను పంచుకోనుండడం విశేషమే.
Also Read: పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి కళ వచ్చేసిందోచ్.!
దేశమంతా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించనుంది. తెల్లదొరల పాలనపై తిరగబడ్డ అల్లూరి సీతారామరాజు (Alluri Seeta Rama Raju), ధైర్యానికీ అలాగే పోరాట పటిమకీ, త్యాగానికీ ప్రతీక.
ఆ మహనీయుడ్ని స్మరించుకోవడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమే.!