Chiranjeevi Taraka Ratna Health.. తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు సినీ నటుడు నందమూరి తారక రత్న.
కాగా, తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశారు.
’సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది’ అంటూ ట్వీటేశారు చిరంజీవి.
‘తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ’ అంటూ చిరంజీవి తన ట్వీటులో పేర్కొన్నారు.
Chiranjeevi Taraka Ratna Health.. తారక రత్న ఫొటో వైరల్..
మరోపక్క నందమూరి తారక రత్నకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోని ఐసీయూ నుంచి సేకరించిన ఫొటోగా చెబుతున్నారు.
తారక రత్నకి మేగ్జిమమ్ లైఫ్ సపోర్ట్‌ని వైద్యులు అందిస్తున్నట్లుగా, ఆయనకు అమర్చిన వైద్య పరికరాల్ని చూస్తే అర్థమవుతోంది.
Also Read: చిరంజీవిలా మేం ‘క్వైట్’ కాదు.! రామ్ చరణ్ ‘మెగా’ హెచ్చరిక.!
కాగా, ‘తారక రత్న సేఫ్.. ఔట్ ఆఫ్ డేంజర్’ అన్న వార్తలతో ఒక్కసారిగా నందమూరి అభిమానులే కాదు, తారక రత్న గురించి ఆందోళన చెందుతున్నవారందరికీ పెద్ద ఉపశమనం లభించినట్లయ్యింది.
నిన్న సాయంత్రం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి విడుదల చేసిన తారకరత్న హెల్త్ బులెటిన్‌లో తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే వుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
అంతకు ముందు తారక రత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, తారక రత్న తనంతట తానుగా శ్వాస తీసుకుంటున్నాడని చెప్పారు.
ఇంతలోనే మెడికల్ బులెటిన్‌లో తారక రత్నకు వెంటిలేటర్ ద్వారా హై లెవల్ లైఫ్ సపోర్ట్ ఇస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.
ఈరోజు తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆసుపత్రి నుంచి హెల్త్ బులెటిన్ రావాల్సి వుంది. ఆ బులెటిన్ వస్తేనే తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత వస్తుంది.