Cloud Burst Weather War.. కంటికి కనిపించని ఓ వైరస్‌తో ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించొచ్చని ఎవరైనా అనుకున్నారా.?
చరిత్ర ఎన్నో వైరస్‌లను చూసింది. మానవాళి నిత్యం వైరస్, బ్యాక్టీరియాలతో సహజీవనం చేయాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
కానీ, కరోనా వైరస్.. అన్నిటికంటే ప్రత్యేకం. ప్రపంచాన్ని కొన్ని రోజులపాటు, నెలలపాటు.. స్థంబింపజేసేసింది. ఆ దెబ్బ నుంచి ప్రపంచం ఇప్పటికీ కోలుకోలేదు.
కరోనా వైరస్‌ని కొందరు జీవాయుధంగా పేర్కొంటున్నారు. చైనా తయారు చేసిన వైరస్‌గా చెబుతున్నారు. ఇందులో నిజమెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
Cloud Burst Weather War.. మేఘమే శాపమై.!
ఇంతలోనే ‘వెదర్ వార్’ అనే పదం కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే, వున్నపళంగా వరదలు సృష్టించడం.. దేశాల్ని దెబ్బ తీయడం అన్నమాట.!
చరిత్రలోకి కాస్త తొంగి చూస్తే, సరిహద్దుల్లో చైనా.. కొన్ని నదుల మీద ప్రయోగాలు చేస్తోంది. వాటి ద్వారా ఆకస్మికంగా వరదలు సృష్టించి, భారతదేశాన్ని దెబ్బ తీయాలన్నది చైనా కుట్ర.
మరి, మేఘాల మీద కూడా అలాంటి కుట్రలు జరిగితే.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో కేసీయార్ ‘క్లౌడ్ బరస్ట్’ మీద వ్యక్తం చేసిన అనుమానాలు ఓ వైపు హాస్యాస్పదమయితే, ఇంకో వైపు ఆలోచింపజేస్తున్నాయి కూడా.
క్లౌడ్ బరస్ట్.. ఓ వెపన్ ఎందుకు కాకూడదు.?
మేఘమధనం గురించి విన్నాం కదా.? వర్షాలు కురవని ప్రాంతాల్లో కృతిమంగా వర్షం కురిపించడమే ఈ ప్రక్రియ. దానికీ, క్లౌడ్ బరస్ట్‌కీ సంబంధమే లేదని కొందరు వాదించొచ్చుగాక.!
కృత్రిమంగా వర్షం కురిపించగలిగినప్పుడు.. కృత్రిమంగానో, కుట్రపూరితంగానో క్లౌడ్ బరస్ట్ లేదా కుండపోతను ఎందుకు సృష్టించలేరు.?
విదేశాల కుట్ర అయి వుండొచ్చని కేసీయార్ అనుమానించడాన్ని విస్తృతార్థంలో చూడాల్సి వుంటుంది.
ఓ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత.. అనే విషయాల్ని పక్కన పెడితే, ఓ సామాన్యుడికి కలిగిన అనుమానంగా ఎందుకు భావించకూడదు.?
Also Read: లీనా.! ‘కాళీ’పై వెకిలితనమా.! వాళ్ళపై చెయ్యగలవా.?
ప్రకృతిని మనిషి ఎప్పుడో నాశనం చేసేశాడు. అందుకే, ఇప్పుడు జరుగుతున్నది వినాశనం. కారణం ఎవరైతేనేం, మన వేలితో.. మన కంట్లోనే పొడిచేసుకుంటున్నాం.
అది కరోనా వైరస్ అయినా.. క్లౌడ్ బరస్ట్ అయినా.. అణ్వాయుధాలైనా.. ఇంకోటైనా.! వెదర్ వార్.. లైట్ తీసుకునే విషయం కాదిది. ముందు ముందు ఇంకెన్ని మానవ కల్పిత వైపరీత్యాల్ని చూడాల్సి వస్తుందో.!