Table of Contents
CM Jr NTR అప్పుడెప్పుడో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీయార్, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు.!
అది గతం. ఆ తర్వాత ఆయనెప్పుడూ రాజకీయ తెరపై కనిపించలేదు. కానీ, రాజకీయాల్లో జూనియర్ ఎన్టీయార్ (Young Tiger NTR) పేరు తరచూ వినిపిస్తూ వస్తోంది.
మొన్నామధ్యన ఓ సందర్భంలో, ‘రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడు.?’ అని ప్రశ్నిస్తే, ‘ఆ ప్రశ్నకు ఇది సందర్భం కాదు.. వేరే సందర్భంలో మాట్లాడుకుందాం..’ అనేశాడు జూనియర్ ఎన్టీయార్.
CM Jr NTR మళ్ళీ రాజకీయాల్లోకి ఎప్పుడు.?
ఇప్పటికైతే సినిమా రంగంలో బిజీగా వున్నాడు జూనియర్ ఎన్టీయార్ (Jr NTR). కానీ, ఆయనకు వివిధ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఆ లిస్టులో బీజేపీ ముందంజలో వుంది.

బీజేపీ జాతీయ నాయకత్వం ఇటీవల హైద్రాబాద్ వచ్చినప్పుడు, జూనియర్ ఎన్టీయార్‌తో ప్రత్యేకంగా భేటీ అవడం చూశాం.
అయితే, ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని జూనియర్ ఎన్టీయార్ సన్నిహితులు చెప్పారు. కానీ, ‘అవసరమైతే ఎన్నికల ప్రచారంలో వాడుకుంటాం’ అని చెప్పారు బీజేపీ నేతలు.
నారా లోకేష్‌కి ప్రత్యామ్నాయమా.?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కి ప్రత్యామ్నాయంగా టీడీపీ పగ్గాల్ని జూనియర్ ఎన్టీయార్ చేపట్టాలన్నది నందమూరి అభిమానుల కోరిక.
చంద్రబాబు రాజకీయ యాత్రలు, బహిరంగ సభల్లో తరచూ ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీయార్..’ (Man Of Masses NTR) అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
ప్లకార్డుల్లో స్వర్గీయ ఎన్టీయార్, హరికృష్ణ అలాగే జూనియర్ ఎన్టీయార్ (Jr NTR CM TDP) ఫొటోల్ని మాత్రమే వాడుతున్నారు నందమూరి అభిమానులు. ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది.
దూరం పెట్టారు.. దగ్గర చేసుకోగలరా.?
2024 ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం. మరి, జూనియర్ ఎన్టీయార్‌ని ఈ ఎన్నికల కోసం టీడీపీ దగ్గర చేసుకుంటుందా.? గతంలోలానే దూరం పెడుతుందా.?
ఏమోగానీ, అభిమానుల అత్యుత్సాహం జూనియర్ ఎన్టీయార్‌ని రాజకీయ వివాదాల్లోకి లాగుతోందన్నది నిర్వివాదాంశం.
Also Read: Konidela Akira Nandan.. ఇంతకీ, అకిరానందన్ ఎవరి కొడుకు.?
రాజకీయమంటే ఈ రోజుల్లో అత్యంత జుగుప్సాకరం.! అందులోకి జూనియర్ ఎన్టీయార్‌ని ఎందుకు లాగడం.? ఇక ముఖ్యమంత్రి అవడం.. అనేది అంత తేలికైన వ్యవహారం కాదు.
అదే సమయంలో, రాజకీయాల్లో సాధ్యం కానిది ఏదీ లేదు.!