Coconut Water Summer Heat.. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చల్లటి నీళ్ళను ఆశ్రయించడం మామూలే.!
సహజ సిద్ధమైన పద్ధతుల్లో చల్లబరిచిన నీరు.. అదేనండీ, మట్టి కుండల్లోని నీళ్ళయితే, ఆరోగ్యకరం.!
కానీ, అది ఔట్‌డేటెడ్ వ్యవహారం.! ఫ్రిజ్‌లోంచి చిల్డ్ వాటర్ గొంతులోకి దిగితే.. ఆ కిక్కే వేరప్పా.! ఇంకో అడుగు ముందుకేసి, చిల్డ్ కూల్‌డ్రింక్ తాగితే, అది వేరే లెవల్.!
ఆగండాగండీ.. కొందరైతే, చిల్డ్ బీర్‌తో పండగ చేసుకోవాలనుకుంటారు.! కానీ, వీటి వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం లభించలదు.
Coconut Water Summer Heat.. చల్లని మజ్జిగ.. కొబ్బరి నీళ్ళు..
వేసవి తాపం నుంచి నిజంగా ఉపశమనం పొందాలంటే, చవకగా దొరికేది పలుచటి మజ్జిగ.! ఈ మజ్జిక ఇచ్చే ఉపశమనం ఇక దేని నుంచీ లభించదు.
కొబ్బరి నీళ్ళు.. రిఫ్రిజిరేషన్ చేసి విక్రయించడం చాలామందికి తెలుసు..
ఏకంగా కొబ్బరి బొండాన్ని కాల్చేసి.. వేడి వేడిగా కొబ్బరి నీళ్ళను విక్రయిస్తుంటారని ఎంతమందికి తెలుసు.?
Mudra369
డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు.. అదీ బయట వున్నప్పుడు, కొబ్బరి నీళ్ళు దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు.
ఔను, కొబ్బరి నీళ్ళను మించి.. వేసవి తాపం నుంచి రక్షణ ఇచ్చేది ఇంకేముంటుంది.? పైగా, స్వచ్ఛత విషయంలో కొబ్బరి నీళ్ళకు సాటి ఇంకేదీ రాదు.!
రేటు.. హీటు.!
రోజులు మారాయ్.! ఒకప్పుడు పది రూపాయల లోపే దొరికిన కొబ్బరి బొండాం, ఇప్పుడు.. అరవై మార్క్ కూడా దాటేస్తోంది.!
అయినాగానీ, తప్పదు.. తక్షణ శక్తి కావాలంటే కొబ్బరి నీళ్ళు తప్పనిసరి.! డీ-హైడ్రేషన్ సమస్య నుంచి కొబ్బరి నీళ్ళు వేగంగా ఉపశమనం కల్గిస్తాయి.
Also Read: Mrunal Thakur.. అవకాశాల్లేక అంత పని చేసిందా.?
బాటిళ్ళలో నింపి కొబ్బరి నీళ్ళు విక్రయిస్తున్న పరిస్థితుల్నీ చూస్తున్నాం. అయితే, కొబ్బరి బొండాం కట్ చేసి.. ఫ్రెష్‌గా తాగితేనే మంచిది.!
అన్నట్టు, కొన్ని చోట్ల కొబ్బరి బొండాల్ని నిప్పుల మీద కాల్చి.. వేడి వేడిగా కొబ్బరి నీళ్ళు విక్రయిస్తుండడం కూడా కనిపిస్తోంది. ఇది మరీ టూమచ్.! పైత్యానికి పరాకాష్ట ఇది.