Coffee With Karan.. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ అనగానే ఆయన రూపొందించిన సినిమాలే కాదు, ‘కాఫీ విత్ కరణ్’ అనే షో ద్వారా చేసిన రచ్చ కూడా గుర్తుకొస్తుంటుంది.
సెలబ్రిటీల్ని ఎలాంటి ప్రశ్నలు అడగకూడదో, అలాంటివే అడుగుతుంటాడు. సెలబ్రిటీల మధ్య చిచ్చు పెడతాడు. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ప్రశ్నలు వేసి, అంతకన్నా జుగుప్సాకరమైన సమాధానాలు రాబడుతుంటాడు కరణ్ జోహార్.
ఆరు సీజన్లు పూర్తి చేసిన కరణ్ జోహార్, ఇక ఇక్కడితో ‘గుడ్ బై’ అంటూ తాజాగా ప్రకటన విడుదల చేశాడు.
Coffee With Karan.. కరణ్ జోహార్.. కంత్రీ షో.!
‘పోతే పోనీ..’ అని అంతా అనుకుంటున్న తరుణంలోనే, నెత్తిన బాంబు పేల్చాడు.. ‘కథ ముగిసిపోలేదు.. కొత్త వేదికపై చెత్తని చూడండి..’ అన్నట్టుగా ఇంకో ప్రకటన చేశాడు ఈ బాలీవుడ్ ఫిలిం మేకర్.
బిగ్ బాస్ రియాల్టీ షో చెత్త బుల్లితెర తెర నుంచి ఎలాగైతే ఓటీటీకి మారిందో, ఇప్పుడు ఈ ‘కాఫీ విత్ కరణ్’ అనే కంత్రీ షో కూడా, బుల్లి తెర నుంచి ఓటీటీలోకి దిగబడబోతోందన్నమాట.
గతానికంటే భిన్నంగా ఏడో సీజన్ చాలా చాలా ప్రత్యేకంగా వుంటుందట. కాఫీ తాగుతూ చాలా ముచ్చట్లు చెప్పుకోవచ్చంటున్నాడు కరణ్ జోహార్. ముచ్చట్లు కావవి, దారుణాలంటున్నారు నెటిజన్లు.
తప్పదు.! భరించాల్సిందే.. ఓటీటీ పైత్యం షురూ.!
‘హమ్మయ్య, ఇక ఈ ఛండాలం ఇకపై వుండబోదన్నమాట.. అని ఊపిరి పీల్చుకునేలోపు, అంతకు మించిన ఛండాలం.. అంటున్నాడేంటీ..’ అంటూ కరణ్ జోహార్ మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
బుల్లితెరపై చాలా టాక్ షోస్ నడుస్తుంటాయి. వాటిల్లో కొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతాయి.. కొన్ని సూపర్ హిట్ అవుతాయి. కొన్ని డిగ్నిటీతో నడుస్తాయ్.. కొన్ని దారుణంగా నడుస్తాయ్.
Also Read: పెళ్లి.! జరగాలి మళ్లీ మళ్లీ మళ్లీ..!
కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షో ఎలాంటిదో తెలిసే, ‘హమ్మయ్య.. ముగించేశావా.? నీకు కోటి నమస్కారాలు..’ అనేశారు చాలామంది.
‘ఏప్రిల్ ఫూల్ కాదు.. ఇది మే ఫూల్..’ అన్నట్టు, కాఫీ టార్చర్ ఇంకా వుందని కరణ్ (Karan Johar) ప్రకటించేసిన దరమిలా, ఈ షో కొత్తగా తీసుకొచ్చే కాంట్రవర్సీలెలా వుంటాయో వేచి చూడాల్సిందే.