Comedian Sunil Tollywood Kollywood.. సునీల్ అంటే ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్. సునీల్ లేకపోతే, సినిమా లేదన్నంతలా వుండేది పరిస్థితి.
హీరోగానూ హిట్లు కొట్టాడు. అలా హీరోయిజం వైపుకు వెళ్ళి, కెరీర్‌ని నాశనం చేసుకున్నాడనే విమర్శలూ వున్నాయ్.
గత కొద్ది కాలంగా తెలుగుతో పోల్చితే, తమిళ సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తున్నాయి కమెడియన్ సునీల్‌కి. తమిళ సినిమాల్లో సునీల్‌ని చూసినప్పుడు, కొన్నిసార్లు నచ్చడంలేదు.
కానీ, తమిళ సినీ అభిమానులకి మాత్రం సునీల్ భలే నచ్చేస్తున్నాడు. సునీల్‌కి డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లభిస్తున్నాయి తమిళ సినిమాల్లో.
Comedian Sunil Tollywood Kollywood.. పెద్ద హీరోలతో సునీల్ ఎడా పెడా సినిమాలు చేసేస్తున్నాడహో..
మొన్నీమధ్యనే అజిత్ హీరోగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో కనిపించాడు సునీల్. అంతకు ముందు రజనీకాంత్ సినిమా ‘జైలర్’లోనూ సునీల్ నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘కట్టలాన్’ అనే సినిమాలో సునీల్ నటిస్తున్నాడు. ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఓ యెత్తు.. ఇదొక్కటీ ఇంకో యెత్తు.. అనేలా వుంది, ఈ సినిమాలో సునీల్ లుక్.
సరే, సినిమా రిజల్ట్ ఎలా వుంటుంది.? అన్నది వేరే చర్చ. హిట్టూ, ఫ్లాపూ.. వీటితో సంబంధం లేకుండా తమిళ సినిమాల్లో సునీల్ కెరీర్ దూసుకుపోతోందిప్పుడు.
తెలుగు సినిమాల్లో ఛాన్సులేవీ..
మన స్టార్ హీరోలు సునీల్‌ని పట్టించుకోవడంలేదా.? సునీల్‌కి తెలుగు సినిమాల్లో నటించడానికే టైమ్ దొరకడంలేదా.? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అప్పుడప్పుడూ తెలుగు తెరపై సునీల్ కనిపిస్తున్నా, ఆ సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ అవడంలేదు. దాంతో, సునీల్ కూడా తమిళ సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తోంది.
Also Read: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ: దెబ్బకి దెయ్యం దిగొచ్చింది.!
ఆ మధ్యన సునీల్ ఆరోగ్యంపై కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేసినా.. అదంతా ఉత్తదేనని తేలిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
ఒక్కటి మాత్రం నిజం.. సునీల్‌ని టాలీవుడ్ మిస్సవుతోంది.. తెలుగు సినీ ప్రేక్షకులు సునీల్ కామెడీని బాగా మిస్సవుతున్నారు.