Committee Kurrollu Niharika YSRCP.. బుర్ర పూర్తిగా చెడిందా.? లేదంటే, మెదడు నిండా నీలి విషం నింపేసుకున్నావా.? ఏంటి ఎంకటీ నీ పైత్యం.?
అదో దిక్కుమాలిన వెబ్సైట్.! దురదృష్టవశాత్తూ మోస్ట్ పాపులర్ తెలుగు వెబ్ సైట్.! ఏ చెత్త అయినా, దాంట్లో నింపేసుకోవచ్చు.
అసలు, ఆ చెత్త వల్లనే, అంత పాపులర్ అయ్యిందేమో ఆ వెబ్ సైట్. నిజానికి, ఇలాంటి చర్చే అత్యంత చిరాకు వ్యవహారం.!
Committee Kurrollu Niharika YSRCP.. సినిమాకీ.. రాజకీయానికీ సంబంధమేంటి.?
సినిమా నటులు రాజకీయాలు మాట్లాడటంలో వింతేమీ లేదు. రాజకీయ పార్టీలు, సినిమా వ్యక్తులపై కక్షపూరిత రాజకీయాలు చేయడమూ చూస్తున్నాం.

‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాకి సంబందించిన ఓ ఫంక్షన్లో కమెడియన్ ఆది, ‘పదకొండు’ అనే సంఖ్య చుట్టూ సెటైరికల్ కామెంట్లు చేశాడు.
అంతే, వైసీపీ శ్రేణులు గుస్సా అయ్యాయ్. కమెడియన్ ఆదిని చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు వైసీపీ మూర్ఖులు.
ఓట్లేసినోళ్ళు సినిమాలు చూడరట..
వైసీపీకి ఏపీలో 40 శాతం ఓటు బ్యాంకు వుంది తెల్సా.. వాళ్ళంతా, ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాని బ్యాన్ చేస్తారు తెల్సా.. అని ఎంకటి తన వెబ్సైట్లో ఓ ఆర్టికల్ రాయించి పారేశాడు.
దీన్నే పిచ్చి.. అంటారు.! తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమంది.? అందులో సినీ అభిమానులు ఎంతమంది.? ఓటీటీ యుగంలో థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేది ఎంతమంది.?
Also Read: జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ ఎక్కువైంది దేవరా.!
ఎన్నికల వేళ కరెన్సీ నోట్లు పంచితేనేగానీ, ఓ సెక్షన్ ఓటర్లు పోలింగ్ బూతుల వైపు వెళ్ళడంలేదు. అలాంటి ఓటర్ల గురించి ప్రస్తావిస్తూ, ఓటు బ్యాంకు.. అనడమే హాస్యాస్పదం.
థియేటర్లలో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నోళ్ళు సినిమాకి వెళతారు. అది ఇష్టం లేనోళ్ళు, ఓటీటీలో సినిమా చూస్తారు. అస్సలు సినిమాలు చూడనోళ్ళు కూడా వుంటారు.

జనసేన సపోర్టర్ అయిన కమెడియన్ ఆది చేసిన కామెంట్ల వల్ల నిర్మాత నిహారిక నష్టపోతుందని తేల్చేశాడు ఎడ్డి ఎంకటి.! బుర్రలో నీలి విషం నిండిపోతే, ఇదిగో ఇలాగే తగలడుతుంది జ్ఞానం.!
వైసీపీ పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం, ఆ వైసీపీ డబ్బులు.. అలాగే వైసీపీ హయాంలో ప్రకటనల రూపంలో ప్రజాధనం గట్టిగా నొక్కేసిన ఈ ఎడ్డి ఎంకటి కూడా ఓ కారణం.