Blood Pressure Anger Management.. ‘నాకు బీపీ వస్తే, ఏపీ వణుకుతుంది..’ అంటాడో సినిమాలో హీరో.! బీపీ అంటే కోపం.. కోపం అంటే బీపీ.. ఈ భావన చాలామందిలో వుంది.!
ఇంతకీ, బీపీకీ కోపానికీ లింక్ వుందా.? లేదా.? బీపీ పెరిగితే కోపం పెరిగినట్టా.? లేదంటే, కోపం పెరిగితే బీపీ పెరిగినట్టా.? దేని వల్ల ఏది వస్తుంది.?
కోపం వల్ల బీపీ వస్తుందా.? బీపీ వల్ల కోపం వస్తుందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయినాగానీ, ఒకదానితో ఒకటి ఖచ్చితంగా సంబంధం వున్నవే.
Blood Pressure Anger Management.. కోపం వల్ల బీపీ వస్తుందిట..
చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చేసుకోవడం వల్ల.. అనగా, అతిగా స్పందించడం వల్ల బోల్డన్ని అనర్ధాలుంటాయ్. శారీరక, మానసిక సమస్యలు తప్పవు.
వాటిల్లో, కుటుంబ సంబంధాలు దెబ్బ తినడం ప్రధానమైది. దాంతోపాటుగా, స్నేహితుల్లోనూ చులకనైపోయే పరిస్థితి రావొచ్చు.
పని ఒత్తిడిని తగ్గించుకోవడం.. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం.. మొక్కల పెంపకంపై దృష్టి సారించడం.. ఆధ్మాత్మిక, విహార యాత్రలు.. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.. యాంగర్ మేనేజ్‌మెంట్‌కి సహకరిస్తాయి.
రక్త పోటుని అదుపులో వుంచుకోవాలంటే.. మద్యానికి దూరంగా వుండాలి. రక్తపోటు లేకున్నా కోపాన్ని అదుపు చేసుకోవడానికి మద్యం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు.
Mudra369
బీపీ వల్ల కోపం రావడం అనేది తప్పుడు ఆలోచన.. అంటారు వైద్య నిపుణులు. బీపీ.. అనగా రక్తపోటు.. ఇది కోపంతో ఊగిపోవడం వల్ల పెరుగుతుందిట.
సో, రక్తపోటుతో బాధపడేవారు కోపాన్ని అదుపులో వుంచుకోవడం చాలా చాలా ఉత్తమం. లేదంటే, అది ఇతరత్రా అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందిట.
శాంతం.. ప్రశాంతం.. ఆరోగ్యానికి ఊతం..
నిజానికి, బీపీ విషయంలోనే కాదు, డయాబెటిస్ విషయంలోనూ ఇంతే.! అందుకే, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు భావోద్వేగాల్ని అదుపు చేసుకోవాలి.
ఔను, కోపం తగ్గించుకుని.. ఆనందంగా వుండటానికి ప్రయత్నిస్తే, బీపీ – డయాబెటిస్ కొంతమేర అదుపులో వుండే అవకాశం వుందని వైద్య నిపుణులు చెబుతుంటారు.
యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది రక్తపోటుతో బాధపడుతున్నవారికి. రక్తపోటు లేకున్నా, కోపాన్ని అదుపు చేయడం అనేది యోగాసనాలతో సాధ్యపుడుతుందని చెబుతుంటారు.
Mudra369
సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. రక్త పోటుని అదుపులో వుంచుకోవడానికి ఇదొక చక్కటి పరిష్కారం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం కూడా రక్తపోటుని అదుపులో వుంచుతుంది. వైద్య నిపుణుల సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి.
Also Read: ‘రేట్లు’ పెంచితే.. తాగడం, వాగడం మానేస్తారా.!?
ఒక్కోసారి అవసరమైతే, మానసిక వైద్య నిపుణుల సూచనల్ని కూడా తీసుకోవాల్సి వుంటుంది. అవసరాన్ని బట్టి సంబంధిత మందుల్ని కూడా వాడాల్సి రావొచ్చు.